తెలంగాణ

కందుల కొనుగోలుకు హాకా, మార్క్‌ఫెడ్‌లకు రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ప్రభుత్వం ప్రకటించిన ధరల ప్రకారం రైతుల నుండి కందులు కొనుగోలు చేసేందుకు హాకా, టిఎస్ మార్క్‌ఫెడ్‌లు బ్యాంకుల నుండి రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. హాకా 300 కోట్ల రూపాయలు, టిఎస్ మార్క్‌ఫెడ్ మరో 300 కోట్ల రూపాయలు జాతీయ బ్యాంకుల నుండి రుణాన్ని తీసుకునేందుకు ప్రభుత్వ అనుమతి వల్ల అవకాశం లభించింది. 2017-18 సంవత్సరానికి పంటల ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించింది. ఈ మద్దతు ధర ప్రకారమే హాకా, టిఎస్ మార్క్‌ఫెడ్‌లు రైతుల నుండి కందుల కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో ఈ పర్యాయం కందుల పంట బాగా ఉంది. దాంతో మార్కెట్లోకి కందులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దాంతో పెద్ద మొత్తంలో కందులు కొనుగోలు చేసేందుకు హాకా, మార్క్‌ఫెడ్‌ల వద్ద నిధులు లేకపోవడంతో ఇబ్బంది అయింది. ఇదే విషయాన్ని సంబంధిత రెండు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు ప్రభుత్వానికి తెలియచేశారు. కందుల కొనుగోలుకు తాము బ్యాంకుల నుండి రుణం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ అంశాన్ని పరిశీలించిన ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు, హాకాకు బ్యాంకుల నుండి 300 కోట్ల రూపాయల చొప్పున రుణాన్ని తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. నిబంధనల మేరకే బ్యాంకుల నుండి మార్క్‌ఫెడ్, హాకాలు రుణాన్ని తీసుకుంటాయి.