తెలంగాణ

తెలంగాణలో విథ్యారంగాన్ని పట్టించుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణ ఉన్నత విద్యారంగానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని ఢిల్లీ వెళ్లిన ఉన్నత విద్యామండలి ప్రతినిధి బృందం యుజిసి చైర్మన్ ప్రొఫెసర్ డీపీసింగ్‌ను గురువారం నాడు కోరింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, ఎంపి బి వినోద్‌కుమార్, మండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ పి వెంకటరమణ , ఓపెన్ యూనివర్శిటీ విసి ప్రొఫెసర్ సీతారామారావులు యుజిసి చైర్మన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత విద్యారంగంలో తీసుకువచ్చిన సంస్కరణలు, కొత్త విద్యాసంస్థల గురించి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి యుజిసి చైర్మన్‌కు వివరించారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వ అనుమతి, నిధులు కోరుతూ ఒక వినతి పత్రాన్ని ఆయన యుజిసి చైర్మన్‌కు అందించారు. వందేళ్లు పూర్తిచేసుకున్న ఉస్మానియా యూనివర్శిటీకి యూనివర్శిటీ ఆఫ్ పొటన్షియల్ కింద నిధులు రావాలని, అలాగే విశ్వవిద్యాలయం ప్రతిపాదించిన రెండు ప్రతిపాదనలకు అనుమతి ఇవ్వాలని కోరారు. దేశంలో మొట్టమొదటి ఓపెన్ యూనివర్శిటీ దూరవిద్య అనుమతి దక్కలేదని, రాష్ట్రంలోని యూనివర్శిటీలకు ఒన్‌టైమ్ గ్రాంట్ అందజేయాలని వారు కోరారు. 2ఎఫ్, 12బి హోదా పొందిన వర్శిటీలకు అక్రిడిటేషన్ కొనసాగించాలని చెప్పిరు. తెలంగాణ యూనివర్శిటీకి 12వ ప్రణాళిక కింద ఐదు కోట్లు అందించాలని, అలాగే తెలంగాణ విశ్వవిద్యాలయానికి మహిళా హాస్టల్‌కు నిధులు ఇవ్వాలని కోరారు. కాకతీయ యూనివర్శిటీ బిఇడి కోర్సునకు యుజిసి గుర్తింపు రావల్సి ఉందని అన్నారు. అలాగే 12వ ప్రణాళిక కింద కాకతీయ వర్శిటీకి నిధులు రావల్సి ఉందని చెప్పారు. యూనివర్శిటీల్లో ఐదు ఇంక్యుబేటరీ కేంద్రాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని, ఇందుకు 50 కోట్ల రూపాయిల సాయం అందించాలని సూచించారు. రాష్ట్రంలో యుజి, పిజి కోర్సులలో ప్రవేశానికి డిజిటల్ విధానం చేపట్టామని, అందుకు సైతం ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు. ఉన్నత విద్యామండలి వద్ద గైడెన్స్, ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని అందుకు సాయం అందించాలని బృందం కోరింది. తెలంగాణ నాలెడ్జి రీసెర్చి సెంటర్‌ను ప్రభుత్వం ప్రతిపాదిస్తోందని, ఆ కేంద్రానికి కూడా ఆర్ధిక సాయం అందించాలని వారు కోరారు.