తెలంగాణ

ఖాయిలా పరిశ్రమలకు టానిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఖాయిలా పడిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలను పునరుద్ధరించేందుకు టానిక్‌లాగా ఆర్థిక సహాయం చేసేందుకు పారశ్రామిక హెల్త్ క్లినిక్ సమాయత్తమవుతోంది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు బ్రెయిన్ చైల్డ్‌గా పేరు పొందిన హెల్త్ క్లినిక్ త్వరలో ఎస్‌బిఐ, ఆంధ్రాబ్యాంకు, ఎస్‌ఐడిబిఐ, కెనరా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం స్పాన్సర్ చేసినతర్వాత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతితో ఏర్పాటైన తొలి నాన్‌బ్యాంక్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూట్‌గా తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అవతరించింది. ఈ సంస్థ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం తొలిదశలో రూ.10 కోట్లను కాంట్రిబ్యూట్ చేసింది. వచ్చే ఏప్రిల్ నాటికి రూ.100 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటుచేస్తారు. వచ్చే ఏప్రిల్ నుంచి పరిశ్రమలకు రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పారిశ్రామిక క్లినిక్‌కు నిధుల కేటాయింపుపై ఇతోధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ రీసెర్చి అండ్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడిఆర్‌బిటి) సహాయంతో టెక్నాలజీని పారిశ్రామిక క్లినిక్‌కు సమకూర్చుతున్నారు. ఈ సంస్థ సేవలను ఆన్‌లైన్‌లో అందించనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరిలోనే ఈ సంస్థకు ఎన్‌బిఎఫ్‌సి గుర్తింపు లభించింది. బ్యాంకులు కూడా ఈ సంస్థ సేవలను వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నాయి. ఇటీవల పారిశ్రామిక క్లినిక్ తీసుకున్న చొరవ వల్ల కొన్ని పరిశ్రమలు మూతపడకుండా మళ్లీ ఉత్పత్తిని ప్రారంభించాయి. ఖాయిలా పడిన ఒక చిన్న పరిశ్రమకు అవసరమైన మొత్తంలో 25 శాతం వరకు నిధులను క్లినిక్ సమకూర్చుతుంది. మిగిలిన సొమ్మును బ్యాంకుల నుంచి సమకూర్చుకోవాల్సి ఉంటుందని పారిశ్రామిక వర్గాలు తెలిపాయి. ఈ సంస్థ చక్కగా పనిచేసి పరిశ్రమలకు చేయూత ఇచ్చేందుకు నిపుణులైన నలుగురు ఇండిపెండెంట్ డైరెక్టర్లు, ఒక నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను నియమించారు. పైగా 22 మందికి పైగా చిన్న పరిశ్రమల ప్రతినిధుల వాటాదారులుగా చేరారు. ఎస్‌ఎల్‌బిసి అంచనా ప్రకారం రాష్ట్రంలో 2655 ఖాయిలా పడిన యూనిట్లు ఉన్నాయి. ఈ ఏడాది ఒక పారిశ్రామిక వాడలో 50 పరిశ్రమలను పునరుద్ధరించేందకు పారిశ్రామిక హెల్త్ క్లినిక్ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని పరిశ్రమలశాఖ అధికారులు తెలిపారు.