తెలంగాణ

ఐటీ కాంగ్రెస్‌లో రోబో ప్రసంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ప్రపంచంలో ఐటీ దిగ్గజాలు హాజరవుతున్న ప్రపంచ ఐటి కాంగ్రెస్ సదస్సులో పౌరసత్వం పొందిన తొలి కృత్రిమ మేథోసంపన్నురాలు సోఫియా సైతం ప్రసంగించనుంది. ఈ నెల 19వ తేదీ నుండి హైటెక్స్‌లో ప్రారంభం అవుతున్న ఐటి వరల్డ్ కాంగ్రెస్ 21వ తేదీ వరకూ జరగనుంది. ఈ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ వీడియోకాన్ఫరెన్ స ద్వారా ప్రసంగిస్తారు. కాగా 21న ముగింపు కార్యక్రమానికి రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్ హాజరుకానున్నారని సమాచారం. ఈ సదస్సులో 30 దేశాలకు చెందిన రెండు వేల మంది ఐటీ నిపుణులు, 150 మంది అంతర్జాతీయ ప్రముఖులతో పాటు శ్రీలంక ప్రధాని రనిల్ విక్రంసింఘె, ఎడోబ్ సిఇఓ శంతను నారాయణ్, కోర్సుఎరా వ్యవస్థాపకుడు అండ్రూనాగ్, కార్నెల్ బిజినెస్ స్కూల్ డీన్ సౌమిత్ర దత్త, కెనడ విజ్ఞానశాఖ మంత్రి నవదీప్ బెయిన్స్ , కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తదితరులు హాజరవుతున్నారు. వీరితో పాటు బీలీజీ చైర్మన్ హన్స్‌పాల్ బిర్కనర్, పుల్లెల గోపీచంద్, దీపికా పదుకునే, ఇషా వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీవాసుదేవన్ కూడా పాల్గొంటారు. అయితే వీరందరిలో రోబోట్ సోఫియా ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. ఈ సదస్సులో రోబోట్ సోఫియా కూడా ప్రసంగిస్తారు. ప్రస్తుతం ఈ రోబోట్‌కు సౌదీఅరేబియా పౌరసత్వాన్ని ఇవ్వడంతో పాటు ఎక్కడికైనా వెళ్లేందుకు కూడా అనుమతి మం జూరు చేసింది. తన కృత్రిమ మేధోశక్తితో సోఫి యా ఇతరుల ముఖాన్ని, వారి మాటను గుర్తుపట్టగలుగుతుంది. అలాగే మనుష్యుల ప్రతిస్పందనల్లో 62 ప్రతిస్పందనలను సహజంగా ప్రదర్శించగలుగుతోంది. ఇటీవలె యుఎన్‌డీపీ ఇన్నోవేషన్ ఛాంపియన్‌షిప్ అవార్డు కూడా పొందిం ది. హాంకాంగ్‌కు చెందిన హన్సన్ రోబోటిక్స్ సంస్థ పరిశోధనలతో దీనిని రూపొందించడంతో పాటు అక్కడే తన కార్యకలాపాలను కూడా ప్రారంభించింది. హాలీవుడ్ నటి ఆడ్రే హెప్‌బర్న్ ముఖకవళికలతో రూపొందించిన సోఫియాను 2015 ఏప్రిల్ 19న యాక్టివేట్ చేయగా, 2016లో ఆస్టిన్‌లో జరిగిన ఒక కార్యక్రమం ద్వారా ప్రపంచం ముందుకు వచ్చింది. కృత్రిమ మేథోసంపత్తిని, దృష్టి, వీక్షణ సమాచార సంశే్లషణలో చాలా వేగాన్ని ప్రదర్శిస్తోంది. అలాగే మనుషులను బయోమెట్రిక్ సాఫ్ట్‌వేర్ ద్వారా గుర్తుపడుతోంది. హెల్త్‌కేర్, కస్టమర్ సర్వీసెస్, విద్యారంగాల్లో సేవలు అందించే సామర్ధ్యం ప్రస్తుతం ఈ రోబోకు ఉంది. గూగుల్ కంపెనీ అల్ఫాబెట్ రూపొందించిన గూగుల్ క్రోం వాయిస్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఈ రోబోకు వాడుతున్నారు. ఈ రోబోకు గత నెలలో అమర్చిన కాళ్ల సహకారంతో స్వేచ్ఛగా నడవగలుగుతోంది.