తెలంగాణ

టీఆర్‌ఎస్ పాలనను ఎవరూ ప్రశంసించలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: కేంద్ర మంత్రులు రాష్ట్రప్రభుత్వ పాలనను ఎక్కడా ప్రశంసించిన సందర్భాలు లేవని, టిఆర్‌ఎస్ మైండ్ గేమ్‌తో పత్రికలు అలా రాస్తున్నాయని, కేంద్ర మంత్రులు ఎవరూ మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర పాలనను ప్రశంసించలేదని బిజెపి అధికార ప్రతినిధులు డాక్టర్ ఎస్ ప్రకాష్‌రెడ్డి, ఎన్ వి సుభాష్, డాక్టర్ కె నరేష్‌లు పేర్కొన్నారు. శనివారం నాడు వారు పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న పథకాలను తాను ప్రత్యక్షంగా చూడాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి రామ్‌కృపాల్ యాదవ్ కోరినా ప్రభుత్వం చూపించలేదని పేర్కొన్నారు. అలాగే కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లి రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశంసించినట్టు పత్రికల్లో వచ్చిందని అది వాస్తవం కాదని వారు చెప్పారు.