తెలంగాణ

పరిశోధనా కేంద్రంగా తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఫిబ్రవరి 17: కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ పాలనా దక్షతతో అతితక్కువ సమయంలో అత్యంత అభివృద్ధి సాధించి నేడు ప్రపంచానికే అభివృద్ధి పరిశోధనకేంద్రంగా నిలుస్తోందని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ ప్రభుత్వ పథకాల కింద జిల్లాలోని 5వేల మందికి ఒకేసారి రూ.134 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఎస్వీ కళాశాల ఆడిటోరియంలో జరిగిన మెగా రుణమేళా కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హజరై రుణాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలపాలనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ అహోరాత్రులు శ్రమిస్తూ నేటి వరకు ఎవరి ఊహలకు సైతం అందని పథకాలకు అంకురార్పణ చేశారన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నదీజలాలతో ఇంటింటికీ మంచినీటిని అందించే లక్ష్యంతో ఎంతో సాహసోపేతంగా రూ.50వేల కోట్లతో ప్రారంభించిన మిషన్ భగీరథ, కాకతీయుల కాలంనాటి సాగునీటి వనరులను పునరుద్దరించేలా చేసిన మిషన్ కాకతీయ, మునుపెక్కడా లేనివిధంగా వ్యవసాయరంగానికి నిరంతర విద్యుత్‌సరఫరా లాంటి పథకాలను అమలు చేస్తుండటంతో నేడు ప్రపంచవ్యాప్తంగా సీఎం కేసీఆర్ ప్రశంసలు అందుకుంటున్నారన్నారు. అంతేకాకుండా నేడు ప్రపంచంలోని వివిధ దేశాలతో పాటు భారతదేశంలోని అనేక విశ్వవిద్యాలయాల విద్యార్థులు మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై పరిశోధనలు చేస్తున్నారన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన కేసీఆర్ సాధించిన రాష్ట్రంలో పేద, దళితవర్గాలు, రైతులు, అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో చిరునవ్వులు చూడాలనే తపనతో ముందుకు సాగుతున్నారన్నారు. నేడు మన రాష్ట్ర పథకాలను ఇతర రాష్ట్రాల్లోని సీఎంలు, పార్టీలు అమలు చేస్తామని వారి రాష్ట్రాల ప్రజలకు చెప్పుకునే స్థాయిలో పథకాలు ఘనత సాధించినట్టు తెలిపారు. వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీటిని అందించే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నామన్నారు. అదేవిధంగా చినుకులు పడగానే రైతులు పంటల సాగుచేసేందుకు అప్పుల కోసం వెతికే దుస్థితిని దూరం చేసి రైతులు అప్పులు లేకుండా వ్యవసాయం చేసేలా వచ్చేనెల నుండి పంటల పెట్టుబడి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. గత పాలకులకు భిన్నంగా సమాజంలో చివరి అంచున ఉన్నవారికి సైతం ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా పథకాలను అమలుచేస్తూ పారదర్శక పాలన కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ నిండునూరేళ్లు వర్థిల్లాలని ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, ఎంపీపీలు వట్టే జానయ్యయాదవ్, భూక్యా పద్మ, ఝాన్సీ, డీఆరోడీవో సుందరి కిరణ్‌కుమార్, జిల్లా సంక్షేమాధికారి మున్నయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడి ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.