తెలంగాణ

రైతులందరికీ సాగునీరు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 17: రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ సాగుకు అవసరమైన సౌకర్యాలన్నింటినీ అందిస్తోందని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు. శనివారం చింతగట్టు వద్ద గల ఎస్‌పిఆర్ గార్డెన్‌లో తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ ఇండిస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకుంటూ ఆధునిక యంత్రాలతో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలని కోరారు. జాతిపిత గాంధీజీ అన్నట్లుగా భారతదేశంలో అధిక జనాభా గ్రామాలలోనే నివసిస్తోందని, ఎక్కు వ మంది వ్యవసాయంపై ఆధారపడుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈవిషయంపై అధిక దృష్టి సారించి నాణ్యమైన కరెంటు, నీటి అవసరాలకు ప్రాజెక్టుల నిర్మాణం, నాణ్యమైన విత్తనాలసరఫరా లాంటివి చేస్తోందని అన్నారు. త్వరలో ఎకరాకు నాలుగు 4వేల రూపాయలు పెట్టబడిని రైతులకుఅందించనుందని అన్నారు.

చిత్రం..సదస్సులో మట్లాడుతున్న రాజ్యసభ సభ్యుడు లక్ష్మికాంతరావు