తెలంగాణ

కొనుగోలు విధానాలు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఫిబ్రవరి 17: రైతుల ఆందోళనల నేపథ్యంలో ఎర్రజొన్న పంటను ప్రభుత్వపరంగానే సేకరించాలని నిర్ణయించినందున, ఈ పంట కొనుగోలుకై పాటించాల్సిన విధివిధానాలపై చర్చించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం తన అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎర్రజొన్న కొనుగోలు సందర్భంగా తలెత్తే సమస్యలేమిటి, వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్య ల గురించి ఈ భేటీలో విస్తృత స్థాయిలో చర్చించి విధివిధానాలను ఖరారు చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ ఎం.జగన్మోహన్, అదనపు డైరెక్టర్ విజయ్‌కుమార్, మార్క్‌ఫెడ్ జనరల్ మేనేజ్ రాములు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మొదటి దశలో వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మంత్రి పోచారం తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, వేల్పూర్, కమ్మర్‌పల్లి, బాల్కొండ వ్యవసాయ మార్కెట్ యార్డులలో ఈ నెల 19వ తేదీ నుండి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నామని, ఎర్రజొన్న క్వింటాలుకు 2300 రూపాయల మద్దతు ధర చెల్లిస్తారని అన్నారు. అవసరాన్ని బట్టి మునుముందు మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఈ విషయంలో రైతులు ఎలాం టి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, చివరి గింజను సైతం కొనుగోలు చేసేంత వరకు ఈ కేంద్రాలను కొనసాగిస్తామని భరోసా కల్పించారు. అయితే రైతులందరూ ఒకేసారి పంటను తీసుకువస్తే ఇబ్బంది తలెత్తుతుందన్న ఉద్దేశంతో టోకెన్ పద్ధతిని అవలంబించాలని సమావేశంలో నిర్ణయించారు. వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు గ్రామాల్లో పర్యటించి, రైతులు సాగు చేసిన ఎర్రజొన్న పంటను పరిశీలించిన మీదట, విస్తీర్ణం, దిగుబడి ఆధారంగా టోకెన్లను జారీ చేస్తారని మంత్రి పోచారం వివరించారు. టోకెన్‌లో పొందుపర్చిన తేదీలో రైతులు ఎర్రజొన్న పంటను మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రానికి తేవాలని సూచించారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను అధికారులకు తెలియజేయాలని, వారు విక్రయించిన పంట తాలూకు నగదును ఆర్‌టీజీఎస్ ద్వారా నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తారని చెప్పారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యవర్తులు, దళారులను నమ్మకూడదని, ఎర్రజొన్న పంట సేకరించేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
పాత నిల్వలను అమ్మేందుకు ప్రయత్నిస్తే
కఠిన చర్యలు
కాగా, కోల్డ్ స్టోరేజీలు, గోడౌన్లలో నిల్వ చేసిన గత ఏడాదికి సంబంధించిన ఎర్రజొన్న నిల్వలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయబోమని మంత్రి పోచారం స్పష్టం చేశారు. ఎవరైనా పాత నిల్వలను విక్రయించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ ఏడాది రాష్ట్రంలోని మూడు జిల్లాలలో సుమా రు 50వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు ఎర్రజొన్న పంటను సాగు చేశారని గుర్తించామని, ఆ మేరకే ప్రస్తుత సీజన్ పంటనే కొనుగోలు చేస్తామని చెప్పా రు. పోలీసు శాఖ సహకారంతో అన్ని సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయించి విస్తృతంగా తనిఖీలు జరిపిస్తామని అన్నారు. ఎర్రజొన్నల కొనుగోలు మొదలుకుని, నిల్వల తరలింపు, వాటిని భద్రపర్చడం వరకు జరిగే ప్రక్రియలను నిరంతరంగా వ్యవసాయ, మార్కెటింగ్, రెవెన్యూ, మార్క్‌ఫెడ్ అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు.

చిత్రం..ఎర్రజొన్న కొనుగోలుకు పాటించాల్సిన విధివిధానాలపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్న మంత్రి పోచారం