తెలంగాణ

పూటకో అబద్ధం చెప్పే కాంగ్రెస్‌కు అధికారం కలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 17: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు వేగవంతంగా నిర్మాణం జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్టులను ఎలాగైనా ఆపి సంతోషపడాలనే ధోరణిలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉన్నారని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు.
ఇలాంటి నాయకులు రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని మరో పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని ఆయన విమర్శించారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా మంత్రి హరీష్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణపేట పట్టణంలోని కళాశాల మైదానంలో సాగునీటి సాధన సభ బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ ఓ చీడపురుగులా తయారైందని, రైతుల కళ్లల్లో ఆనందం చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తుంటే వాటిపై కేసులు వేసి ప్రాజెక్టులను ఆపుదల చేసి రైతుల కళ్లల్లో మట్టి కొట్టాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని విమర్శించారు. నిజంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, కాంగ్రెస్ నాయకులకు రైతులపై ప్రేమ ఉంటే రాష్ట్రంలో ప్రాజెక్టులపై వేసిన కేసులను వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై కేసు వేసిన కాం గ్రెస్ నాయకుడు హర్షవర్దన్‌రెడ్డి వేసిన కేసును కూడా వాపసు తీసుకుని తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కేసు వేసిన హర్షవర్దన్‌రెడ్డి కాంగ్రెస్ నాయకుడు కాకుంటే తక్షణమే ఆయనను కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేసి రైతులపై కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉన్నట్టు నిరూపించుకోవాలని హితవు పలికారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని మాయమాటలు చెప్పినా పూటకో అబద్దం ఆడినా మరో పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని మంత్రి హరీష్ ఎద్దేవా చేశారు.
అబద్దపు మాటలు చెబుతున్నారని ఆరోపించారు. తాము కృష్ణాజలాలను బీడు వారిన పాలమూరు జిల్లా పొలాల్లో పారించాలనే తపనతో మాట్లాడుతున్నామని వారు మాత్రం నీరు రాని గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు.

చిత్రం..మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న మంత్రి హరీశ్‌రావు