తెలంగాణ

రైల్వేలో టెక్నాలజీ వృథ్ధి నిరంతర ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: రైల్వేలో సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చేసుకుంటూ పోవడం అనేది ఓ నిరంతర ప్రక్రియ అని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ అన్నారు. రైల్వే వినియోగదారులు సంతృప్తి చెందే వరకు, రైల్వే శాఖ లక్ష్యాలు సాధించే వరకు సాంకేతికాభివృద్ధి అనేది నిరంతరం వృద్ధి చెందే ప్రక్రియ అని పేర్కొన్నారు. రైల్వేలో పని చేస్తున్న 13.5 లక్షల మంది ఉద్యోగులు తమ వృత్తినైపుణ్యం పెంచుకోవడంతో పాటు, టెక్నాలజీలో పైచేయి సాధించడం అనేది అతిపెద్ద సవాల్ అని అన్నారు. సోమవారం నాడిక్కడ రైల్వేలోని వివిధ సంస్థల్లో టెక్నాలజీకి సంబంధించిన శిక్షణ అందించే ‘శిక్షకులకు ఐదు రోజుల శిక్షణ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజ్ ఆఫ్ ఇండియా (ఎఎస్‌సిఐ) ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. పలు కేంద్ర శిక్షణ సంస్థలు, జోనల్ రైల్వే శిక్షణ సంస్థలు, ఇతర రైల్వే శిక్షణ సంస్థల నుంచి డైరక్టర్లు, సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. శిక్షకుల సామర్ధ్యాన్ని పెంచేందుకు గాను రైల్వేలో తొలిసారిగా ఎఎస్‌సిఐ ద్వారా శిక్షణ అందిస్తున్నట్లు ఈ సందర్భంగా జిఎం వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. పరిపాలనలో రైల్వే సిబ్బందికి నిరంతర టెక్నాలజీ వృద్ధి తదితర అంశాలపై వీరంతా శిక్షణ కల్పిస్తారని వివరించారు. తమ వద్ద ఉన్న వారికి ఏవిధంగా శిక్షణ అందించాలనే అంశాన్ని ఆసరా చేసుకుని ఈ శిక్షణ కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్లు చెప్పారు. ఈ ఐదు రోజుల శిక్షణలో ఆధునాతన ట్రైనింగ్ పద్దతుల ద్వారా వివరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రైల్వే సీనియర్ అధికారులు, ఎఎస్‌సిఐ అధికారులు పాల్గొన్నారు.-