రాష్ట్రీయం

వర్షాకాలం నాటికి కాళేశ్వరం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టును వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేసే లక్ష్యానికి అనుగుణంగా పనులను శరవేగంగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను స్వయంగా ఈ నెల 22, 23 తేదీలలో పరిశీలించనున్నట్టు చెప్పారు. జలసౌధలో సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను మంత్రి సమీక్షించారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ మరింత వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ ఏడాది కాళేశ్వరం నుంచి గోదావరి జలాలతో తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. నీటిపారుదలశాఖ రేయింబవళ్లు కృషి చేస్తే తప్ప అనుకున్న గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేయలేమన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపు హౌజ్‌ల నిర్మాణం కూడా ఏకకాలంలో జరుగాలని మంత్రి సూచించారు.
దుబ్బాక, గజ్వేల్, మేడ్చెల్, మెదక్, ఆలేరు అసెంబ్లీ నియోజక వర్గాలకు సాగునీరు అందించే 17,18, 19 ప్యాకేజిల పనుల పురోగతిపై మంత్రి ఆరా తీసారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్ర సరిహద్దుల్లో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులపై ఇక నుంచి ప్రతీ రోజు రెవిన్యూ, నీటిపారుదలశాఖలు సమన్వయంతో సమీక్షించాలని మంత్రి ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు అత్యధికంగా అటవీ ప్రాంతంలోనే ఉండటంతో వర్షాలు ప్రారంభం కాకముందే పనులు పూర్తి చేయాలని మంత్రి సూచించారు.

చిత్రం..జలసౌధలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సమీక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావు