తెలంగాణ

సైబర్ నేరాల నిరోథానికి టాలీవుడ్ సెలబ్రెటీలతో ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: రోజు రోజుకీ పెరిగిపోతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వివి శ్రీనివాసరావు చేపట్టారు. ముఖ్యంగా సైబర్ నేరాలను ఐదు విభాగాలుగా విభజించి ఒక్కో విభాగానికి ఒక్కో టాలీవుడ్ సెలబ్రెటీల ద్వారా ప్రచారం చేయాలని భావించి ఇందుకు సంబంధించిన వీడియోలను సోమవారం ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికగా జరిగే నేరాలు అంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, జాబ్, వీసా మోసాలు, వివాహ సంబంధిత మో సాలు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ (ఎంఎల్‌ఎం) నేరాలు, ఓటిపి ఆధారిత క్రెడిట్, డెబిట్ కార్డులతో చేసే సైబర్ నేరాలకు సంబంధించిన వీడియోలను రూపొందించారు. వీటిని జూబ్లీహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబొరెటరీలో తొలి ప్రదర్శన నిర్వహించారు. ఈ వీడియోలను ప్రచా రం చేయడం ద్వారా సాధారణ ప్రజలను సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంచే విధంగా విజ్ఞప్తి చేయడంతో పాటు సైబర్ నేరగాళ్లకు చెక్‌పెట్టే విధంగా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సైబర్ క్రైం డిసిపి ఆధ్వర్యంలో నిర్వహించారు.

చిత్రం..వీడియోలను విడుదల చేస్తున్న కమిషనర్ వీవీ శ్రీనివాసరావు, నిర్మాత దిల్‌రాజు తదితరులు