తెలంగాణ

రేషన్ బియ్యం ఎక్కడైనా తీసుకోవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సలహా మేరకు పౌరసరఫరాల శాఖ చేపట్టిన సంస్కరణలతో సర్కారుకు ఏటా 800 కోట్ల నుండి 850 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతోంది. అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో ఈ విజయం సాధించారు. ప్రస్తుతం ఒక రేషన్‌దుకాణం పరిధిలో ఉండే లబ్దిదారుడు అదే రేషన్ దుకాణంలో బియ్యం తీసుకుంటున్నారు. ఈ విధానంలో మార్పు చేస్తూ, ఒక ఊళ్లో లేదా ఒక పట్టణంలో ఉండేవారు రాష్ట్రంలో ఎక్కడ ఉన్న రేషన్ దుకాణంలోనైనా బియ్యం తీసుకునే సౌకర్యం 2018 మే 1 నుండి అమలు చేయబోతున్నారు. ఒక జిల్లాలోని లబ్దిదారుడు అదే జిల్లాలోని ఏ దుకాణంలోనైనా బియ్యం లేదా ఇతర సరకులను తీసుకునే విధానం మార్చి 1 నుండి అమలు చేయబోతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉంటున్న లబ్దిదారులు తమకు అందాల్సిన సరకులను జిల్లాలోని ఏ దుకాణంలోనైనా తీసుకునే అవకాశాన్ని 2017 జూన్ నుండి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం అయింది. దాంతో ఈ విధానాన్ని మరింత విస్తరిస్తూ, మే 1 నుండి ఏ ప్రాంతంలో నివసించే లబ్దిదారుడైనా రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉన్న ఏ రేషన్ దుకాణంలోనైనా బియ్యం తదితర రేషన్ సరకులను కొనుగోలు చేసే కార్యక్రమం అమల్లోకి వస్తోంది. దేశంలో ఈ విషయంలో తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రంగా అవతరించబోతోంది.
పౌరసరఫరాల శాలో చేపట్టిన సంస్కరణల గురించి ఈ శాఖ కమిషనర్ సి.వి. ఆనంద్ గురువారం మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ-పాస్) విధానాన్ని అన్ని రేషన్ షాపుల్లో (17 వేల షాపులు) ప్రారంభించారు. తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలోని 800 దుకాణాల్లో పైలట్ ప్రాతిపదికన ఈ విధానం ప్రారంభం అయింది. ఈ-పాస్ యంత్రంలో ప్రధానమైంది డిస్‌ప్లే, స్కానర్, కీప్యాడ్‌లు. వీటిని తూనికల యంత్రానికి అనుసంధానం చేశారు. డీలర్ల చేతివేళ్ల ముద్రలతో పాటు రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలో లబ్దిదారుల చేతివేళ్ల ముద్రలతను ముం దుగానే సేకరించి మిషన్‌లో నిక్షిప్తం చేశారు. ఒక కటుంబంలోని వ్యక్తి ఎవరు రేషన్ దుకానికి వచ్చినా వేలిముద్ర తీసుకుంటారు. ఈముద్ర ఆధార్ నెంబర్‌తో అనుసంధానం కలిగి ఉంటుంది. కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి ఎంత బియ్యం ఇవ్వాలో వెల్లడవుతుంది. ఆమేరకు బియ్యం లేదా ఇతర సరకును డీలర్లు ఇస్తారు. ప్రతి రేషన్ దుకాణంలోని ఈ-పాస్ రాజధానిలోని పౌరసరఫరాల శాఖలో ఏర్పాటు చేసిన సర్వర్‌తో అనుసంధానం అయి ఉంటుందని ఆనంద్ తెలిపారు. ప్రతి ఈ-పాస్ యంత్రం నెట్‌వర్క్ ద్వారా సర్వర్‌కు కలిపి ఉంటుంది. మార్కెట్లో ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియా, తదితర అన్ని కంపెనీలతో సేవలు తీసుకునేందుకు పౌరసరఫరాల శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. సంస్కరణల్లో భాగంగా ఈ-పాస్ మిషన్లు ఉపయోగించడంతో బియ్యం పంపిణీ సమర్థతగా జరుగుతోంది. నిజమైన లబ్దిదారులే వేలిముద్రల (బయోమెట్రిక్ విధానం) ద్వారా సరకులు తీసుకోవాల్సి వస్తోంది. వేలిముద్రలు ఏదైనా కారణంతో పనిచేయకపోతే, కంటిపాప (ఐరిష్) ఫోటోతో సరకులు ఇస్తారు. గతంలో ప్రతినెలా 85 లక్షల మంది లబ్దిదారులకు 1.75 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాల్సి వచ్చేది. బోగస్ కార్డులున్న వారు రేషన్ తీసుకోవడం మానివేశారు. బయోమెట్రిక్ అమల్లోకి రావడంతో ప్రతినెలా 20 వేల టన్నుల బియ్యం ఆదా అవుతోంది. అంటే ఏటా 800 నుండి 850 కోట్ల రూపాయల విలువ చేసే 2.40 లక్షల టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఆదా అవుతోందని ఆనంద్ వెల్లడించారు.
1 నుండి 15 వరకు సరకుల పంపిణీ
రేషన్ దుకాణాల్లో ప్రతి నెలా 1 నుండి 15 వర కు ప్రజలకు సరకుల పంపిణీ చేస్తామని ఆనంద్ వెల్లడించారు. 16 నుండి నెల చివరి వరకు పౌరసరఫరాల శాఖ కేంద్ర కార్యాలయం నుండి జిల్లాలకు, దుకాణాలకు బియ్యం తదితర వస్తువులను సరఫరా చేస్తామన్నారు. ఈ నెల నుండి ఈ విధానం అమల్లోకి వచ్చిందని వివరించారు. లబ్దిదారులు సరకులు కొనుగోలు చేసిన వారి మొబైల్ ఫోన్‌కు సమాచారం అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. తూకంలో తేడాలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

చిత్రం..పౌరసరఫరాల శాఖలో చేపట్టిన సంస్కరణలను వివరిస్తున్న కమిషనర్ సీవీ ఆనంద్