తెలంగాణ

ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 22: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే జిల్లా స్థాయి ఆస్పత్రులలో అన్నిరకాల వైద్య సేవలు అందిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం స్థానిక జిల్లాఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక వైద్యశాలల రూపురేఖలు మార్చినట్టు తెలిపారు. ముఖ్య మంత్రి కేసీఆర్ అభివృది,్ధ సంక్షేమ పథకాలకు ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నారో అంతే ప్రాధాన్యతను ప్రజల ఆరోగ్యంపై కూడా ఇస్తున్నారని దీనితో దేశంలో ఎక్కడా లేనివిధంగా వినూత్నమైన అనేక కార్యక్రమాలను విజేయవంతంగా కొనసాగిస్తున్నామన్నారు. పీహెచ్‌సీ పరిధి నుంచి జిల్లా ఆస్పత్రి స్థాయి వరకు ఉన్న అన్ని వైద్యశాలలో ఆధునిక వసతులతో తీర్చిదిద్దుతున్నామని అన్నారు. రాష్టవ్య్రాప్తంగా 40డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే చాలా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. అదే విధంగా అన్ని జిల్లా ఆస్పత్రులలోను, ఏరియాస్పత్రులలోను ఐసీయూ కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని రకాల అత్యవసర వైద్య సేవలను అం దించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గర్భంలో బిడ్డ పడినప్పటి నుంచి మనిషి మరణించే వరకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలను అందించడంతో పాటు వారికి అవసరమైన అంబులైన్స్ సౌకర్యాలను కల్పించామన్నారు.
102, 108, 104, 108బైక్ వాహనాలతో పాటు పార్థివ వాహనాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలోని పేదలకు సూమారు రూ. 2వేల కోట్లు లబ్ధి పొందారని అన్నారు. శస్తచ్రికిత్సలు లేని ప్రసవాలు జరిపిస్తున్నామన్నారు. నాలు గు లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని వాటిలో ఒకటి రోగాలు రాకుండా ప్రజలను చైతన్యపరచడం, వచ్చిన రోగాన్ని ముందుగానే గుర్తించి తగిన వైద్యం అందించడం తదితరమైనవి ఉన్నాయన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ పేరుతో అన్ని వైద్యశాలలో ల్యాబ్‌లను ఏర్పాటు చేసి వ్యాధి నిర్ధారణ కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇంటింటికీ కంటి, పంటి పరీక్షలు చేస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిపై భారం అధికంగా పడినప్పటికీ వైద్య సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజలకు సేవలు అందించేందుకు ముందుకు రావాలన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి అది చేస్తున్న వారిని నాలుగు కాలాల పాటు కాపాడుకోవాలన్నారు. నాగర్‌కర్నూల్ ఆస్పత్రిని అత్యాధునికంగా తీర్చిదిద్దుతామని, మాత శిశు వైద్యశాలలను ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. ఈ నెల 24నుంచి జిల్లాలో చెంచు హెల్త్ కార్యక్రమాన్ని చెపడుతున్నట్లు తెలిపారు.