తెలంగాణ

14 పరిశ్రమలకు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: టిఎస్ ఐపాస్ కింద 14 పరిశ్రమలకు పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం అనుమతి పత్రాలు అందజేశారు. 14 పరిశ్రమలు 1118.62 కోట్ల రూపాయల పెట్టుబడితో 7079 మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు స్థాపించనున్నారు. మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ పరిశ్రమలు స్థాపించనున్నారు. ఇప్పటి వరకు టిఎస్‌ఐపాస్ ద్వారా 1013 యూనిట్స్‌కు అనుమతి ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. 25972,28 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు స్థాపించారు. మొత్తం 76,314 మందికి ఉపాధి లభిస్తుంది. తెలంగాణలో అన్ని రకాల చెల్లింపులు ఆన్‌లైన్‌లో ఉండేట్టు చేస్తామని, దీని వల్ల ఆలస్యాన్ని నివారిస్తామని పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ తెలిపారు. రెండు వందల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టే పలు పరిశ్రమలకు సంబంధించి అనుమతి ప్రక్రియ సాగుతుందని తెలిపారు. ఏప్రిల్‌లో పలు మెగా ప్రాజెక్టులు రాష్ట్రానికి రానున్నాయని, చైనా, స్వీడన్ పర్యటన విజయవంతం అయిందని చెప్పారు. నిమ్జ్‌కు లాంచనప్రాయంగా అనుమతి లభించిందని తెలిపారు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం పరిశ్రమల స్థాపనకు అనుమతి ఇవ్వడానికి 30-45 రోజుల సమయం తీసుకుంటారని చెప్పారు. టిఎస్‌ఐపాస్ ప్రపంచంలోనే అత్యున్నత పారిశ్రామిక విధానం అని తెలిపారు.