తెలంగాణ

మాటలతో మభ్య పెడుతున్న సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఫిబ్రవరి 25: మభ్యపెట్టే మాటలతో తప్పుదారి పట్టిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు మాజీ మంత్రి, సీఎల్‌పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గజ్వేల్ నియోజకవర్గ పరిదిలోని వర్గల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయం శిరోధార్యమని, ఎక్కడి నుండి పోటీ చేయమన్నా అక్కడి నుండి బరిలో నిలువడానికి సిద్ధమని ప్రకటించారు. గజ్వేల్, సిద్దిపేట, నల్గొండలలో పోటీకి సిద్ధమని, అయితే ఎన్నికల్లో కాకుండా ప్రచార బాధ్యతలు అప్పగిస్తే సైతం చిత్తశుద్ధితో పనిచేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో దుర్మార్గపు పాలన, మూర్ఖపు పాలన కొనసాగుతోందని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిలదీస్తే అక్రమ కేసులు, అరెస్టులతో ప్రతిపక్షాలను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఎద్దేవా చేశారు. రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో చెల్లించకపోగా, ఇంకా బ్యాంకర్లు నోటీసులు ఇస్తుండడం సిగ్గుచేటని నిలదీశారు. అయితే కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే రూ. 2లక్షల రుణమాఫీపై మొదటి సంతకం చేసి వెంటనే వర్తింప జేస్తామని, అలాగే నిరుద్యోగులకు రూ. 3వేల భృతి చెల్లిస్తామని తెలిపారు. గజ్వేల్‌తోపాటు రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, ఎర్రవల్లి, నర్సన్నపేటలకే పరిమితమైన డబల్‌బెడ్‌రూం ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు నిర్మించి ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కే-4 పాలన కొనసాగుతుండగా, కాంట్రాక్టులన్నీ ఆంధ్రగుత్తేదారులకే మంజూరు చేస్తున్నట్టు ఎద్దేవా చేశారు. అయితే నలుగురు ఆంధ్ర కాంట్రాక్టర్‌ల కింద 10వేల మంది సబ్ కాంట్రాక్టర్‌లు పనిచేస్తుండగా, వారికి బిల్లులు చెల్లించకపోవడంతో ఆత్మహత్యలకు సిద్ధమవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటమి భయం పట్టుకున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వ డబ్బుతో రైతులకు రూ. 8వేల రాయితీ ఇవ్వడానికి సిద్ధపడుతుండగా, అన్నదాతలు డబ్బులకు అమ్ముడుపోరని తగిన విదంగా బుద్ధి చెబుతారని అన్నారు. కమీషన్‌ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌భగీరథకు నిధులు కేటాయిస్తుండగా, మిషన్‌కాకతీయ, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్ తదితర శాఖలకు నిదులు ఎందుకు మంజూరు చేయడంలేదని నిలదీశారు. ఫీజ్ రీయంబర్స్‌మెంట్ వర్తింపజేయకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరంగా ఉండగా, రంజాన్, దసరా, బతుకమ్మ బట్టల పేరిట ప్రభుత్వ డబ్బును టీఆర్‌ఎస్ కొల్లగొట్టినట్టు ఆరోపించారు. ప్రగతిభవన్, ఫాంహౌస్‌కే పరిమితమైన సీఎం కేసీఆర్ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీలేదని, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలో దించిన ఘనత ఆయనకే దక్కినట్టు పేర్కొన్నారు. తెలంగాణలో ఆత్మహత్యలు చూడలేక ఇక్కడి ప్రజల ఆకాంక్షలను గౌరవించిన సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటింపజేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు, ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, ప్రతిపక్షాలు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు మాట్లాడడం పట్ల ఆక్షేపించారు. అయితే భూ నిర్వాసితులను పూర్తి స్థాయిలో ఆదుకోవడంతోపాటు పరిహారం చెల్లించాలన్నదే తమ డిమాండ్ అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెంకట్‌రాంరెడ్డి, మండలాల బాధ్యులు నరేందర్‌రెడ్డి, తమ్మలి శ్రీనివాస్, నేతలు మాదాడి జశ్వంతరెడ్డి, లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, నర్సింహాచారి, గాలెంక నర్సింలు, ఎక్బాల్, సర్దార్‌ఖాన్, రామరాజశర్మ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..వర్గల్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న సీఎల్‌పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి