తెలంగాణ

ఎఇఇ ఉద్యోగాలకు 30న ఇంటర్వ్యూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (మెకానికల్) పోస్టుల నియామకానికి ఈ నెల 30వ తేదీన ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు. నోటిఫికేషన్ 12/2015 ద్వారా లిఖిత పరీక్షలో ఎంపికైన అభ్యర్ధులకు మాత్రమే వౌఖిక పరీక్ష ఉంటుందని, 30వ తేదీన ఉదయం 9 గంటలకే అన్ని ఒరిజనల్ సర్ట్ఫికేట్లతో అభ్యర్ధులు హాజరుకావాలని సూచించారు.
రాజధానిలో థింక్‌సెల్ సెంటర్
థింక్‌సెల్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించినట్టు సంస్థ డైరెక్టర్ ఆదిత్యరెడ్డి తెలిపారు. జిఆర్‌ఇ, జిమ్యాట్, శాట్, ఎల్ శ్యాట్, ఎసిటి, యుఎస్‌ంఎల్‌ఇ, ఎన్‌బిడిఇ, ఎన్‌సిఎల్‌ఇఎక్స్, టోఫెల్, ఐఇఎల్‌టిఎస్ తదితర అంతర్జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష, అర్హత పరీక్షలకు ప్రపంచస్థాయి శిక్షణ అందిస్తామని అన్నారు. హైస్కోర్ గ్యారంటీ స్కీమ్‌ను తాము అమలుచేస్తున్నామని, లేకుంటే వారు కట్టిన ఫీజును వెనక్కు ఇవ్వడం జరుగుతుందని ఆమె చెప్పారు.

రూ.200 కోట్లతో
స్వచ్ఛ హైదరాబాద్

హైదరాబాద్, డిసెంబర్ 22: రెండువందల కోట్ల రూపాయల వ్యయంతో స్వచ్ఛ హైదరాబాద్‌కు పథకాలు రూపొందించినట్టు ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో ప్రకటించిన కార్యక్రమం ప్రకారం నగరంలో కెటిఆర్ మంగళవారం తడిచెత్త, పొడి చెత్తకు అవసరం అయిన తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే స్వచ్ఛ హైదరాబాద్ విజయవంతం అవుతుందని అన్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదారాబాద్ అంటూ పిలుపు ఇవ్వడానికి బాగానే ఉంటుందని, అయితే ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఇవి విజయవంతం అవుతాయని అన్నారు. సికిందరాబాద్‌లోని సింధి కాలనీలో చెత్త బుట్టలు పంపిణీ చేశారు. మంత్రి కెటిఆర్ మంగళవారం కుందన్‌బాగ్‌లోని మెథడిస్ట్ కాలనీలో ఎవరికీ చెప్పకుండా ఎలాంటి పోలీసుల భద్రత లేకుండా ఆకస్మికంగా పర్యటించి, కాలనీ వాసులతో ముచ్చటించారు. కాలనీ సంఘం వారితో, కాలనీలో చెత్త సేకరించే కార్మికులతో మాట్లాడారు. ప్రభుత్వం పనితీరుపై కాలనీవాసుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. త్వరలోనే 800 కిలో మీటర్ల మేర రోడ్లు వేయనున్నట్టు మంత్రి తెలిపారు. భవిష్యత్తులో వైట్ టాంపింగ్ రోడ్లతో పాటు , కేబుల్ వేర్ల కోసం ప్రత్యేకంగా కామన్ డక్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

ఏసిబి సైబర్ సెల్ ప్రారంభం

హైదరాబాద్, డిసెంబర్ 22: అవినీతిపరుల ఆట కట్టించేందుకు, సైబర్ నేరగాళ్లకు తగిన శిక్ష వేయడంలో కీలకమైన సాక్ష్యాధారాలను కనిపెట్టే సైబర్ సెల్‌ను మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ ప్రారంభించారు. నగరంలోని అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘సైబర్ సెల్’ను ఆయన ఏసిబి డైరెక్టర్ జనరల్ ఏకె ఖాన్, డైరెక్టర్ చారు సిన్హాతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసిబి డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ అవినీతి అధికారులు, అవినీతి పరులనెవరినైనా ఉపేక్షించేది లేదని కొత్తగా వచ్చిన టెక్నాలజీతో అవినీతి పరుల ఆటకట్టిస్తామని హెచ్చరించారు. పలు నేరాల దర్యాప్తునకు ఉపయోగపడే సైబర్ సెల్‌ను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ శర్మ ఏసిబి అధికారులకు సూచించారు. సైబర్ సెల్‌తోపాటు వెబ్‌సైట్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ను కూడా ఆయన ప్రారంభించారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వాట్సాప్: 9440446106, ఏసిబి టోల్ ఫ్రీ నెం. 1064ను కూడా వినియోగించుకోవాలని ఏసిబి డైరెక్టర్ జనరల్ ఏకె ఖాన్ సూచించారు.

మార్కెట్ ధరకు కందులు
కొనుగోలు చేయనున్న కేంద్రం

హైదరాబాద్, డిసెంబర్ 22: మార్కెట్ ధరకే రాష్ట్రంలో కందులు కొనుగోలు చేసేందుకు కేంద్రం పనె్నండు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ధరల స్థీరీకరణ కోసం ఈ కందులను వినియోగ దారులకు అందించేందుకు నిల్వ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎఫ్‌సిఐ, నాఫెడ్ ఆధ్వర్యంలో పనె్నండు కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ కేంద్రాల ద్వారా కందులను సేకరిస్తారు. ఈ రెండు సంస్థలు మార్క్‌ఫెడ్ ద్వారా కందులను కొనుగోలు చేస్తాయి. ఎఫ్‌సిఐ కోసం మార్కెట్‌ఫెడ్ కొండగల్, నారాయణపేట, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, భైంసాలో కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. నాఫెడ్ కోసం మార్క్‌ఫెడ్ తాండూర్, వికారాబాద్, జైనూర్ బోథ్, సూర్యాపేట, జహీరాబాద్, బడేపల్లిలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. రైతుల నుంచి కందులు నేరుగా కొని వారి ఖాతాల్లో ఆన్‌లైన్‌లో 72 గంటల్లో చెల్లిస్తారు. ఇప్పటికీ ఎఫ్‌సిఐ ద్వారా తాండూర్, నారాయణపేట, కొండగల్‌లలో ఐదువందల క్వింటాళ్లకు పైగా కందులు కొనుగోలు చేసినట్టు చెప్పారు.

అగ్రి గోల్డ్‌పై సమగ్ర నివేదిక
సిఐడిని ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్, డిసెంబర్ 22: అగ్రి గోల్డ్ కేసులో ఇంతవరకు జరిగిన దర్యాప్తు వివరాలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు మంగళవారం ఆంధ్రా సిఐడి శాఖను ఆదేశించింది. తెంలగాణ అగ్రి గోల్డ్ కస్టమర్స్ ఏజెంట్ల సంక్షేమ సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ కేసులో సిఐడి దర్యాప్తు తీరును కోర్టు విచారించింది. హైకోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ తరఫున న్యాయవాది రవి ప్రసాద్ వాదనలు వినిపిస్తూ ఒకటి రెండు రోజుల్లో కమిటీ సమావేశమై గుర్తించిన ఆస్తులను ఇ- ఆక్షన్ చేయడంపై నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు తెలిపారు.