తెలంగాణ

జూరాలలో తగ్గిన నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 11: జూరాల జలాశయంలో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టులో నీటిసామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4 టీఎంసీలు మాత్రమే ఉంది. మరో టీఎంసీ పడిపోతే ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి రానుంది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన గురవుతున్నారు. ప్రభుత్వం జూరాల ఆయకట్టు రైతాంగానికి వారబందిగా మార్చి 10వ తేదీ నాటికి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే గడువు ముగియడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. కుడి, ఎడమ కాల్వల పరిధిలోని దాదాపు 75 వేల ఎకరాలను రైతులు పంటలు సాగుచేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికే కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు రిజర్వాయర్లకు నెల రోజుల క్రితమే వాటి మోటార్లను బంద్ చేశారు. జూరాల నుండి నీటిని ఎత్తిపోస్తే మంచినీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు దాపురిస్తాయని గ్రహించిన అధికారులు ఆ మూడు రిజర్వాయర్ల నీటి ఎత్తిపోసే జూరాల దగ్గర గల మోటార్లను బంద్ చేశారు. అయితే ఆయకట్టు రైతులు మాత్రం నీరు వస్తుందని పంటలు సాగు చేశారు. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు కింద గల ఆయకట్టు రైతాంగం ఆందోళనకు గురవుతున్నారు. వారబంది నీటి విడుదల గడువు ముగియడంతో ఇక అధికారులు జూరాల ప్రాజెక్టు నుండి నీటి విడుదలను నిలిపివేస్తే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరి ఆయకట్టు రైతులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాము సాగుచేసిన పంటలు మరో నెలరోజులు అయితే తమ చేతికి వస్తాయని రైతులు చెబుతున్నారు. ప్రాజెక్టులో కేవలం నాలుగు టీఎంసీల నీటిమట్టం ఉండడంతో అధికారులు నీటిని వదులుతారా లేదా అనే మీమాంసలో పడ్డారు. అధికారులు నీట విడుదల చేస్తేతప్ప తాము సాగు చేసిన పంటలు చేతికి రావని రైతులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా వారబంది గడువుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రైతులు ఎదురు చూస్తున్నారు.