తెలంగాణ

సిరిసిల్లలో అపరల్ సూపర్ హబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ సిరిసిల్ల, మార్చి 13: సిరిసిల్ల ప్రాంతంలో 20 ఎకరాల్లో అపెరల్ పార్క్ సూపర్ హబ్ ఏర్పాటుకానుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, కేఏవై వెంచర్స్ మధ్య సచివాలయంలో మంగళవారం ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా చేనేత మంత్రి కె తారకరామారావు మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ. 100 కోట్లతో సూపర్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా 15 వేల మందికి,
పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేయనున్న అపెరల్ సూపర్ హబ్‌తో సిరిసిల్ల రూపురేఖలు మారబోతున్నాయన్నారు. చేనేత, నేత కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నారన్నారు. నేతన్నలకు కష్టాలు లేకుండా చూడాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. తిర్పూర్‌లో వస్త్ర పరిశ్రమపై అధ్యయనం చేశామని, రాష్ట్రంలో చేనేత, నేత కార్మికులను ఆదుకోవడానికే తెలంగాణ టెక్స్‌టైల్, అపెరల్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. గత బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ. 1200 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా మరమగ్గాలు సిరిసిల్లలోనే ఉన్నాయన్నారు. సూరత్, బివాండికి రాష్ట్రం నుంచి వలసలు వెళ్లిన వారిని తిరిగి స్వరాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలోనే అతి పెద్ద మెగా టెక్స్‌టైల్ పార్క్ వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. నూలు, రసాయనాల మీద 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామని, నేత కార్మికులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకుని వారికి అండగా ఉంటున్నామన్నారు. నేతన్నలకు చేయూత పథకంతో సామాజిక భద్రత కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు.

చిత్రం..మంత్రి కేటీఆర్ సమక్షంలో కేఏవై వెంచర్స్‌తో
ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ప్రభుత్వాధికారులు