రాష్ట్రీయం

ఘనంగా ముగిసిన తెలుగు తిరునాళ్ళు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ిశాఖపట్నం, డిసెంబర్ 22: పరవస్తు పద్యపీఠం, గోకుల్‌చంద్ర, రాహుల్ చంద్రట్రస్ట్ సంయుక్త నిర్వహణలో విశాఖలో గత మూడు రోజులుగా జరుగుతున్న తెలుగు తిరునాళ్ళు కార్యక్రమం మంగళవారం ఘనంగా ముగిసింది. ‘తెలుగు పద్యం రాజనీతి’ అనే అంశంపై నగరానికి చెందిన ప్రముఖుల పద్యాలాపన, మహా సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహరావు టీకా తాత్పర్య వివరణలతో చివరిరోజు కార్యక్రమం ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా సభా కార్యక్రమ ప్రారంభంలో నగరానికి చెందిన ప్రముఖ కథా రచయిత డాక్టర్ చింతకింది శ్రీనివాసరావుకు చిన్నయసూరి కథా పురస్కారాన్ని డాక్టర్ సూరపనేని విజయ్‌కుమార్, ఆంధ్రా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావు, డాక్టర్ గరికపాటి నరసింహరావు, పరవస్తు పద్యపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు పరవస్తు ఫణిశయన సూరి తదితరుల చేతులమీదుగా అందజేశారు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు...అనే పద్యాన్ని సభాధ్యక్షులు డాక్టర్ సూరపనేని విజయకుమార్ శ్రావ్యంగా వినిపించి సభకు శ్రీకారం చుట్టారు.

క్రీమీలేయర్ రద్దు చేయాలి
బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య

ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, డిసెంబర్ 22: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న బీసీ క్రిమీలేయర్ అమలు నిర్ణయాన్ని రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం వచ్చిన ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బీసీలను విభజించి పాలించేందుకు కొత్త విధానాలను తీసుకొస్తోందని, 6లక్షల ఆదాయం ఉన్న బీసీలకు రిజర్వేషన్ వర్తించదంటే ఎలా అని ప్రశ్నించారు. క్రిమీలేయర్‌కు శాస్ర్తియత, హేతుబద్ధత లేదని, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో క్రిమీలేయర్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. 1993లోనే నాటి ప్రభుత్వాలు క్రిమీలేయర్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నించాయని దీనిపై తీవ్ర నిరసనలు వచ్చాయన్నారు. టిఆర్‌ఎస్‌లో ఉన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు దీనిని అడ్డుకోవాలని, లేకుంటే పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఒక శాతం కూడా లేని కులం రాష్ట్రాన్ని పాలిస్తోందని, 52 శాతం ఉన్న బీసీలను అణచివేసేందుకు యత్నిస్తోందన్నారు.
బీసీల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా హిజ్రాలను బీసీల్లో కలుపుతామని ప్రకటించారన్నారు. క్రిమీలేయర్ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని కోరుతూ ఈ నెల 24న హైదరాబాద్‌లో ఉద్యోగ, రాజకీయ సంఘాలతో అఖిలపక్షం నిర్వహిస్తామని, 26న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 27న హైదరాబాద్‌లో తాను దీక్ష చేస్తానన్నారు. 30వ తేదీన సమావేశం ఉంటుందన్నారు. ఆ తర్వాత 48 గంటల్లో ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్.కృష్ణయ్య