తెలంగాణ

డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు ‘దోస్త్’ షెడ్యూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: తెలంగాణలోని డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఉన్నత విద్యామండలి దోస్త్ పేరిట ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టింది. 2018-19 విద్యాసంవత్సరానికి సంబంధించి మే 8న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. తొలి దశ వెబ్ ఆప్షన్లు మే 10 నుండి మే 26 వరకూ జరుగుతుంది. ఈ మేరకు తాత్కాలికంగా షెడ్యూలును రూపొందించారు. 400 రూపాయిల జరిమానాతో మే 27 నుండి 29 వరకూ దరఖాస్తు చేయవచ్చు. తొలి జాబితాను జూన్ 4న విడుదల చేస్తారు. ఎంపికైన వారు ఆయా కాలేజీల్లో జూన్ 5 నుండి 12లోగా రిపోర్టు చేయాలి. రెండో దశ అడ్మిషన్ల వెబ్ ఆప్షన్లకు జూన్ 13 , 14 తేదీల్లో అవకాశం ఇస్తారు. సీట్ల కేటాయింపు జూన్ 19న జరుగుతుంది. జూన్ 20 నుండి 25లోగా రిపోర్టు చేయాలి. మూడో దశ వెబ్ ఆప్షన్లకు జూన్ 26 , 27 తేదీల్లో అవకాశం ఇస్తారు. జూన్ 30న సీట్ల కేటాయింపు జరుగుతుంది. జూలై 2 నుండి 4వ తేదీలోగా విద్యార్థులు రిపోర్టు చేయాలి. తరగతులు జూన్ 2 నుండి ప్రారంభం అవుతాయి. సోమవారం నాడు జరిగిన దోస్త్ కమిటీ సమావేశం ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వి వెంకటరమణ , వివిధ వర్శిటీల రిజిస్ట్రార్‌లు, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. దోస్త్ అడ్మిషన్లలో గత రెండేళ్లలో ఎదురైన అనుభవాలను ఈ సందర్భంగా చర్చించారు. 2018-19 సంవత్సరానికి మార్గదర్శకాలు, కాలేజీల డాటా అప్‌లోడింగ్‌కు షెడ్యూలు, అభ్యర్ధులు సీట్ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల షెడ్యూలు, అకడమిక్ క్యాలండర్, రిజిస్ట్రేషన్ ఫీజు తదితర అంశాలను ఈ సందర్భంగా ఖరారు చేశారు.