తెలంగాణ

రైతు కోసం కాళేస్వరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు, మిడ్ మానేరు, కొమరవెల్లి మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని సాగునీటిపారుదల మంత్రి టి హరీశ్‌రావు వెల్లడించారు. మొత్తం ఆయకట్టుకు దశల వారీగా 2021-22 నాటికి సాగునీరు అందిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయకట్టు వివరాలు వెల్లడిస్తూ కరీంనగర్‌లో 800, రాజన్న సిరిసిల్లలో 1,53,539, సిద్ధిపేటలో 3,29,616, మెదక్‌లో 2,47,418, యాదాద్రిలో 2,49,105, నల్లగొండలో 29,169, సంగారెడ్డిలో 2,69,744, నిజామాబాద్‌లో 18,279, జగిత్యాలలో 19,979, కామారెడ్డిలో 1,84,108, నిర్మల్‌లో లక్ష ఎకరాలు, మేడ్చెల్‌లో 29,473, పెద్దపల్లిలో 30 వేల ఎకరాలు కలిపి 18,25,700 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఇప్పటికే ఉన్న 18.82 ఎకరాల ఆయకట్టు స్థిరీకరిస్తామని, కొత్త ఆయకట్టు 18.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. దీనివల్ల మొత్తం 37 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినట్టు అవుతుందన్నారు. ప్యాకేజీల గురించి వివరిస్తూ మేడిగడ్డ బ్యారేజీలో 26.55 శాతం, మేడిగడ్డ లిఫ్ట్‌లో 36.82 శాతం, అన్నారం బ్యారేజీలో 67.12, అన్నారం లిఫ్ట్‌లో 49.21, సందిళ్ల బ్యారేజీకి 54.44, సందిళ్ల లిఫ్ట్‌కు 40.12, ఆరవ ప్యాకేజీకి 76.32, 7వ ప్యాకేజీకి 98.40, మేడారం రిజర్వాయర్‌కు 96.98, 8వ ప్యాకేజీలో 77.76, 9వ ప్యాకేజీలో 29.81, మలక్‌పేట్ రిజర్వాయర్‌లో 18.39, 10వ ప్యాకేజీలో 66.65, 11వ ప్యాకేజీలో 65.29, శ్రీరంగ నాయక సాగర్ రిజర్వాయర్‌లో 25.88, 12వ ప్యాకేజీలో 50.45 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. శ్రీకొమరవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్, గంధమళ్ల రిజర్వాయర్, బస్వాపూర్ రిజర్వాయర్, మేడిగడ్డ లిఫ్ట్‌లో, అన్నారం, సందిళ్ల లిఫ్ట్‌లో పనులు వివిధ దశల్లో చురుకుగా సాగుతున్నట్లు అసెంబ్లీకి వివరించారు. కాళేశ్వరం తొలి ఫలితం వరంగల్, పాత నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలకు దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ఆయా నియోజకవర్గాల్లోని కాల్వలను ఆధునీకరించే పనులు చురుగ్గా చేపట్టామన్నారు. పాలకుర్తి నియోజకవర్గానికి ఎస్సారెస్పీ, దేవాదుల ఎత్తిపోతల పథకం కింద నీళ్లు వస్తాయన్నారు. ఎస్సారెస్పీ కింద చివరి ఆయకట్టు వరక సాగునీరు అందిస్తామన్నారు. భవిష్యత్‌లో రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆన్‌లైన్ రిజర్వాయర్ల సామర్థ్యాన్ని 107 టిఎంసికి పెంచుకున్నామన్నారు. 2007లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసి 2014 వరకు ఎందుకు అనుమతులు తీసుకురాలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు. ఈ అంశంపై సభలో కల్వకుంట్ల విద్యాసాగర్, జి సునీత, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ తదితరులు మాట్లాడారు.