తెలంగాణ

నాగోల్ టు ఫలక్‌నుమా టు ఎయిర్‌పోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: మెట్రో రైలును నాగోల్ నుం చి ఫలక్‌నుమా, అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు విస్తరణకు పట్టణాభివృద్థిశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సుముఖత వ్యక్తం చేశారు. మెట్రో రైలు విస్తరణకు భవిష్యత్‌లో చేపట్టే ప్రణాళికలో నాగోల్ నుం చి ఎయిర్‌పోర్టు మార్గాన్ని చేర్చడానికి మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. శాసనసభ కమిటీ హాల్‌లో బుధవా రం హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు నాగోల్ నుంచి ఫలక్‌నుమా అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రోరైలు మార్గాన్ని విస్తరించాలని ఎ మ్మెల్యేలు కోరగా, మంత్రి సానుకూలంగా హామీ ఇచ్చా రు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చార్మినార్ సంరక్షణ, అభివృద్ధికి చేపట్టిన పనుల పురోగతిని ఎమ్మెల్యేలకు మంత్రి వివరించారు. చార్మినార్ సందర్శనకు పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో పార్కింగ్, టాయ్‌లెట్లు, మంచినీటి వసతీని ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. చార్మినార్ పెడెస్ట్రియన్ ప్రాజెక్టు పూర్తి అయ్యాయక అక్కడి వీధుల్లో చేపట్టాల్సిన పనులపై ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. చార్మినార్ సంరక్షణ, అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించనున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. చార్మినార్ ద్వారాలను పోలిన డిజైన్లతో తీర్చిదిద్దనున్నట్టు వివరించారు. అక్కడి షాపులన్నీ ఏకరూపం లో ఉండే విధం గా డిజైన్ చేస్తామన్నారు. పాత నగరంలో పనుల్లో చారిత్రక డక్కన్ అర్కిటెక్ట్‌ను అనుసరించి డిజైన్లు చేయాలని సూచించారు. మూసీ నది సుందరీకరణ, అభివృద్ధి ప్రణాళికలోనూ డ క్కన్ అర్కిటెక్ట్‌ను అనుసరించాలన్నారు. మూసీపై నిర్మించనున్న బ్రిడ్జీలకు నయా పూల్ బ్రిడ్జి డిజైన్‌ను ఉపయోగించుకోవాలన్నారు.