తెలంగాణ

ఐదు ప్రాజెక్టులకు రీ డిజైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: తెలంగాణలో ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి, జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల సాగునీటి పథ కం, ఇందిరమ్మ వరద ప్రవాహ కాల్వ, పీవీ నరసింహారావు కం తనపల్లి సుజల స్రవంతి, సీతారామ ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుకు రీ డిజైన్ చేశామని భారీసాగునీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. హైడ్రాలజీ ప్రాంతం, పరిష్కరించని అంతర్‌రాష్ట్ర అంశాలు, నీటి నిల్వ విషయంలో సాంకేతిక లోపాలను సరిదిద్దేందుకు ఈ ప్రాజెక్టులకు రీ డిజైన్ చేశామన్నారు. రీ డిజైన్ లేకుండా కొన్ని ప్రాజెక్టుల ఆచరణ సాధ్యపడదన్నారు. బుధవారం అసెంబ్లీలో ఆయన ప్రశ్నోత్తరాల కా ర్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, డా. కె. లక్ష్మణ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, సాగునీటి ప్రాజెక్టుల వి షయంలో కాంగ్రెస్ అడ్డుపడుతోందని, రాజకీయ లబ్ధి కోసం కుయుక్తులకు పాల్పడి అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రజలకు లబ్ధిచేకూరే విధంగా పనిచేస్తోందన్నారు. తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత బ్యారేజీ నుంచి మళ్లింపు ప్రవాహాల పరిమాణాన్ని సమీక్షించాలని, ప్రాజెక్టుల నిల్వ ఆవశ్యకతలను తీర్చడానికి కృత్రిమ రిజర్వాయర్ల నిర్మా ణం లేదా ఆన్‌లైన్ రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని కేంద్ర జల సంఘం సూచించిందన్నరు. ఈ ప్రాజెక్టు కింద అ దనంగా 30 లక్షల ఎకరాల నూతన ఆయకట్టు స్థిరీకరణ సా ధించేందుకు రూ. 61.48 కోట్లతో ఈ ప్రాజెక్టులను రీ డిజైన్ చేశామన్నారు. ఆన్‌లైన్ రిజర్వాయర్ల నిల్వసామర్థ్యాన్నిల 206.36 టీఎంసీలకు పెంచామన్నారు. 250 కి.మీ పొడువు మే ర గోదావరి నది పునరుజ్జీవనం ద్వారా మత్స్యపరిశ్రమ, పర్యాటక, దేశీయ జల రవాణాల పరిధి పెరుగుతుందన్నారు. కెసిఆర్ సంకల్పం, దైవబలం వల్ల ప్రాజెక్టుల నిర్మాణాన్ని కాంగ్రెస్ నేతలు ఆపలేకపోతున్నారన్నారు. డిపిఆర్‌లులేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్న అభియోగంలో నిజం లేదన్నారు. కాం గ్రెస్ పార్టీ గోబెల్స్ ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటోందన్నారు. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ నిధులు ఇచ్చే పద్ధతిని రద్దు చేశామన్నారు. కంతనపల్లి వద్ద 11 వేల ఎకరాలు, 20 గిరిజన గ్రామాలు ముంపునకు గురవుతాయని, అందుకే తుపాకుల గూడెం వద్ద బ్యారేజీ నిర్మిస్తున్నామన్నారు. నీటి లభ్యత ఆధారంగానే ఐదు ప్రాజెక్టులను రీ డిజైన్‌చేశామన్నారు. గోదావరిలో నీటినిల్వతో భూగర్భ జలాల వృద్ధి జరుగుతుందన్నా రు. మత్స్య సంపద పెరుగుతుందన్నారు. పాలమూరు ప్రా జెక్టు కట్టకపోతే తెలంగాణ ప్రభుత్వం చారిత్ర తప్పిదం చేసినట్లవుతందన్నారు. ఈ ప్రాజెక్టును నిర్మిస్తే కృష్ణా జలాల కేటాయింపుల్లో న్యాయం జరుగుతుందన్నారు. దుమ్ముగూడెం వ ద్ద నీటి లభ్యత అధికంగా ఉందన్నారు. భారతదేశం మొత్తంపైన ప్రాజెక్టుల నిర్మాణంలో కొత్త వొరవడి సృష్టించామన్నారు. రాత్రింబవళ్లు మూడు షిప్పు్టల్లో పనిచేసి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నామన్నారు. ప్రతిపక్ష పార్టీలురాజకీయ లబ్ధి కోసం అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి విమర్శించారు.