తెలంగాణ

చెట్లు మనకు ప్రాణాధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: మొక్కలను పెంచడం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గుతుందని, వర్షాలు సకాలంలో కురుస్తాయని ఆయుష్ డైరెక్టర్ (మాజీ) డాక్టర్ కొండపల్లి నరసింహారెడ్డి తెలిపారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఔషధమొక్కల ఈఎల్‌పీ కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడు తూ, అడవుల విస్తీర్ణం కనీసం 33 శాతం ఉండాలని, తెలంగాణలో 24 శాతమే అడవుల విస్తీర్ణం ఉందన్నారు. ఔషధ మొక్కలను పెద్దఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ‘సుస్థిర నగరాలు- అడవులు’ అంశంపై కాటన్ బోర్డు మాజీ సభ్యుడు డాక్ట ర్ నరసింహారెడ్డి మాట్లాడారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో అడవుల ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యుడు డాక్టర్ మనోహర్‌రావు, డీన్ అగ్రికల్చర్ డాక్టర్ కేఎస్ డాంగి, అసోసియేట్ డీన్ డాక్టర్ జెల్లా సత్యనారాయణ, ఈఎల్‌పీ మెడిసనల్ ప్లాంట్స్ డైరెక్టర్ ఏ. మాధవీలత పాల్గొన్నారు.