తెలంగాణ

అప్పులు చేయకపోతే అభివృద్ధి ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/చార్మినార్, మార్చి 21: రాష్ట్భ్రావృద్ధి, ప్రజల సంక్షేమంపై ఎంతో ముందుచూపుతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాము ఇపుడు అప్పులు చేసి అభివృద్ధి చేయకపోతే, ఇంకా 50 ఏళ్ల గడిచినా, కనీస అభివృద్ధి ఉండదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ తాను కొత్తగా ఎమ్మెల్యేగా సభకు వచ్చినపుడు రూ. 16వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అంచన వ్యయం చేసిన ప్రభుత్వం అయిదేళ్ల పాటు అధికారంలో ఉండి, తిరిగి రూ.30వేల కోట్లతో ప్రాజెక్టు వ్యయాన్ని తిరిగి రూపొందించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ కూడా కాళేశ్వరం, డబుల్ బెడ్ రూం స్కీం, జెన్‌కో స్టేషన్లు, రోడ్లు, తాగునీటి అవసరాలు వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల అమలు కోసమే, రాష్ట్రానికి భారీ ఆస్తులను సృష్టించేందుకేనన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. రైతు రుణాల మాఫీకి సుమారు రూ. 17వేల కోట్లను సహాయం చేయాలని కోరినా కేంద్రం స్పందించలేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్లలో అప్పులు చేస్తూ, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వారికి అండగా ఉంటుందని, సామాన్యుల కోసం ఆలోచించటం లేదని మంత్రి రాజేందర్ వ్యాఖ్యానించారు.

కార్డులను తొలగించే ఆలోచన ప్రభుత్వానికి లేదు

హైదరాబాద్, మార్చి 21: ఉద్దేశపూర్వకం గా కార్డులను తొలగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. అర్హులైన వారందరికీ కార్డులు అం దించి చౌకదుకాణాల ద్వారా రేషన్ బియ్యం అందించేందుకు తమ ప్రభు త్వం సిద్దంగా ఉందని అన్నారు. ఈ-పాస్ విధానంతో అమలులో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్న మాట వాస్తవమేనని వాటిని సరిదిద్దేందుకు ఐరీష్ విధానాన్ని సైతం అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. రాబోవు రెండు, మూడు నెలల్లో రేషన్ ఇబ్బందులు పూర్తి తొలగిపోతాయని వివరించారు. ఎక్కడా కూడా వేలిముద్రలు సరిపోవడం లేదని రేషన్ ఆపివేయడం లేదని వివరించారు. ఈ పాస్‌తో 98 శాతం వరకు అక్రమాలను అరికట్టగలిగామని తెలిపారు. కేంద్రం విధించిన ఆదాయ స్లాబ్‌ను పెంచి మరీ కార్డులు అందజేశామని చచెప్పారు. గ్యాస్ కనెక్షన్స్ పెరుగుతున్నందునే కిరోసిన్ ఇవ్వాడాన్ని తగ్గిస్తున్నామని, భవిష్యత్‌లో 100 గ్యాస్ కనెక్షన్స్ పూర్తిచేస్తామని తెలిపారు.