తెలంగాణ

ప్లాస్టిక్ ఫ్రీ జోన్లుగా అర్బన్ పార్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: రాబోయే రోజుల్లో తెలంగాణ అడవులు, ఫారెస్ట్ బ్లాకుల్లో ఏర్పాటు చేయనున్న అర్బన్ పార్కులను కూడా ప్లాస్టిక్ ఫ్రీ జోన్లుగా ప్రకటించాలని రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయించింది. బుధవారం అటవీ దినోత్సవం సందర్భంగా నగర శివారులోని కండ్లకోయ అర్బన్ ఫారెస్ట్ పార్క్ (ఆక్సిజన్ పార్క్)లో పక్షుల కేంద్రం పనులకు రాష్ట్ర టవీ శాఖ మంత్రి జోగు రామన్న శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా ఆయన అడవులు, వన్యప్రాటులకు ప్లాస్టిక్ వల్ల కలుగుతున్న అనర్థాలు, పర్యావరణపరంగా పొంచి ఉన్న ముప్పుపై చర్చించారు. అడవుల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలు, వ్యూ పాయింట్లు, వాటర్ ఫాల్స్, ఫారెస్ట్ అర్బన్ పార్కులకు సందర్శకుల సంఖ్య రోజు, రోజుకూ పెరుగుతున్నదని, అదే సమయంలో ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా పేరుకుపోవడం బాధాకరమని మంత్రి రామన్న అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేరళ ప్రభుత్వం కొన్ని అటవీ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్ తీసుకుని వెళ్ళే సందర్శకుల నుంచి నామమాత్రపు రుసుము తీసుకుని, ఆ తర్వాత వారు వెళ్ళేప్పుడు తిరిగి ఇచ్చేస్తే ఆ మొత్తాన్ని వెనక్కి ఇస్తోందన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. అదే రీతిలో ప్లాస్టిక్ బాటిల్, కవర్లు, రేపర్లు ఇలా సందర్శకులు తీసుకుని వెళ్ళే వస్తువుల నుంచి కొంత రుసుం తీసుకుని, ఆ వస్తువులపై ఓ స్టిక్కర్ అంటించి తిరిగి వాటిని తెచ్చి ఇచ్చిన వారికి ఆ రుసుం ఇచ్చేయాలని నిర్ణం తీసుకున్నారు.