తెలంగాణ

దశలవారీగా తెలుగు అమలు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/చార్మినార్, మార్చి 21: మాతృ భాష పరిరక్షణ కోసం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి టెన్త్‌క్లాస్ వరకు తెలుగు భాష తప్పనిసరిని దశల వారీగా అమలు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం శాసనమండలిలో వెల్లడించారు. తెలుగు భాష అమలు, తెలుగు భాషా పండితుల చేయూత అంశాలకు సంబంధించి బుధవారం సభలో సభ్యులు పి.సుధాకర్‌రెడ్డి, పూల రవీందర్, నారదాసు లక్ష్మణ్‌రావు, మజ్లీస్ సభ్యులు జాఫ్రీల ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి సమాధానం చెబుతూ తెలుగు భాషా గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు ఇటీవలే నగరం వేదికగా ప్రపంచ మహాసభను ఎంతో ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్టవ్య్రాప్తంగా 76వేల స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. తొలుత ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరిగా అమలు చేయాలని సర్కారు భావించిందని, అయితే టెన్త్ తర్వాత వచ్చే కోర్సుల్లో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే విషయాన్ని గుర్తించి, టెన్త్ వరకు తప్పనిసరిగా అమలు చేసేందుకు సిద్దమైనట్లు తెలిపారు. అదే రోజు తెలుగు భాష తప్పనిసరి చేయాలన్న అంశంపై నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర రాష్ట్రాలో మాతృ భాష అమలు తీరుపై అధ్యయనం కోసం ఓ బృందాన్ని నియమించారని తెలిపారు. తమిళనాడు తదితర రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన బృందం తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాతృభాషను పదవ తరగతి వరకు అమలు చేస్తున్నట్లు సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే టెన్త్ క్లాస్ వరకు తెలుగును తప్పనిసరి చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు.