తెలంగాణ

మినీ బస్సుల సేవలను విస్తరిస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/చార్మినార్, మార్చి 21: రాష్టవ్య్రాప్తంగా ప్రతిరోజు 90లక్షల మందిని, హైదరాబాద్ నగరంలోనే డైలీ 35లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతున్న ఆర్టీసి బస్సులకు సమాంతరంగా మినీ బస్సుల సేవలను విస్తరించనున్నట్లు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు స్పష్టం చేశారు. శాసనమండలి బుధవారం నాటి సమావేశంలో సభ్యుడు ఎం.ఎస్. ప్రభాకర్‌రావు, ఇతర సభ్యుల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం చెబుతూ మినీ బస్సులను నడుపుతున్న ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రజారవాణా వ్యవస్థ మెరుగుపడిందని, మున్ముందు మరిన్ని ప్రాంతాలకు ఈ మినీ బస్సుల సర్వీసులను ప్రవేశపెట్టే యోచన ఉన్నట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి కిలోమీటరుకు ఒక బస్ షెల్టర్ ఉండాలన్న నిబంధన మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం 1202 బస్ షెల్టర్లు ఉన్నాయని, త్వరలోనే 826 ఆధునిక బస్ షెల్టర్లను, నాలుగు గ్రేడ్‌లుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇందుకు ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కూడా ఆయన వివరించారు. ఈ బస్ షెల్టర్లలో గ్రేడ్‌ను బట్టి సౌకర్యాలుంటాయని వివరించారు. మొదటి క్యాటగిరీ కింద వచ్చే బస్ షెల్టర్లలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని టికెట్ జారీ యంత్రాలను కూడా అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. మిగిలిన వివిధ గ్రేడ్‌లుగా బస్ షెల్టర్లలో కియోస్క్, పురుషులు, మహిళలకు వేర్వేరుగా టాయిలెట్లు, ఏటీఎం, మొబల్ ఛార్జింగ్ పాయింట్ ఉచిత వైఫై, డస్‌బిన్ వంటి సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. గ్రేడ్ 4లో కేవలం డస్ట్‌బిన్ వంటి సౌకర్యాలు మాత్రమే ఉంటాయని మంత్రి వివరించారు.
ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు పనులకు కేంద్రం అడ్డు : కేటీఆర్
నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి, వాహన రాకపోకలను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం రూపొందించిన ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు పనులకు కేంద్ర ప్రభుత్వం అడ్డుగా మారిందని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అసహనాన్ని వ్యక్తం చేశారు. స్కైవేలకు, మల్టీలేవెల్ ఫ్లై ఓవర్లకు స్థలాలివ్వాలని కోరితే, కేంద్రం అర్థరహితమైన ఆంక్షలను విధిస్తోందని ఆయన సభాముఖంగా తెలిపారు. శంషాబాద్, ఆరంఘర్ ప్రాంతాల్లో మరో స్కైవేను నిర్మించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. బీజేపీ సభ్యుడు రాంచందర్‌రావు జోక్యం చేసుకుని అవసరమైతే తాము కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని తెలిపారు.
అయితే తాము మూడేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నా, కేంద్రం సానుకూలంగా స్పందించటం లేదని, మీ వల్ల అడ్డంకులు తొలిగితే స్కైవేలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావులతోనే శంకుస్థాపన చేయిస్తామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.