తెలంగాణ

గ్రామీణ వాతావరణాన్ని రక్షించేందుకు ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: రాష్ట్రంలో గ్రామీణ వాతావరణాన్ని రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాదానం చెప్పారు. గతంలో పాలించిన వారికి చిత్తశుద్ది ఉంటే కులవృత్తులు ఈ స్థాయిలో దిగజారేవి కావని, తెలంగాణ ఏర్పాటు అనంతరం కులవృత్తులకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగానే గొర్లెల పంపిణీ, చెపల పెంపకం వంటి ప్రత్యేక పధకాలను తీసుకువచ్చి అమలు చేస్తున్నట్టు చెప్పారు. గతంలో చేపల పెంపకం అంటే కేవలం ఆంధ్ర ప్రాంతానికి చెందినదనే భావన ఉండేదని, అయితే అందుకు భిన్నంగా మిషన్ కాకతీయ వంటి పధకాల ద్వారా చెరువుల్లో నీరు చేరడంతో ఇక్కడ చేపల పెంపకాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. దీని ద్వారా ఆ రంగంపై ఆధారపడిన వారికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా గొర్లెల పంపిణీ ప్రక్రియ రాష్ట్రం లో సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కేవలం గొర్రెలను పంపిణీ చేసి వదలి వేయకుండా, పశుగ్రాసం, వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. 100 సంచార పశువైద్యశాలలను అందుబాటులోకి తెచ్చామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భారీ బడ్జెట్‌ను కేటాయిస్తూ ఆయా వర్గాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నామని అన్నారు. త్వరలో రాష్ట్రంలో మీట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.