తెలంగాణ

తెలంగాణ సాహిత్యం అద్వితీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మార్చి 22 : తెలంగాణ సాహిత్య చరిత్రను పునర్ లిఖించే ప్రక్రియను సిద్దిపేట నుండి మొదలుపెడతామని...అందుకు తెలంగాణ సాహి త్య అకాడమీ పూనుకుంటుందని ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో గురువారం సిద్దిపేట జిల్లా ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సిద్దిపేట సాహితీ సౌరభం పుస్తకాల పరిచయ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాహిత్యానికి రచయితలకు సరైన గుర్తింపు లభించలేదన్నారు. సాహిత్య మంటే ఆంధ్ర ప్రాంత రచయితలు రాసిందే సాహిత్యమనే ప్రచారం జరిగిందన్నారు. ఇక్కడ భాషకు, యాసకు తగిన గుర్తింపు లభించలేదన్నారు. తెలంగాణకు గొప్ప సాహిత్య చరిత్ర ఉందని, తెలుగు భాష పుట్టుక తెలంగాణలోనే జరిగిందని చారిత్మ్రాక ఆధారాలతో నిరూపించినట్టు పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు సాహిత్య ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాయన్నారు. ఈసభ ద్వారా తెలంగాణ సాహిత్యకారుల గొప్పతనాన్ని సాధికారికంగా నిరూపించామని తెలిపారు. ఈసభకు హాజరైన సీమాంధ్ర ప్రాంత రచయితలు తెలంగాణ సాహిత్య చరిత్ర గొప్పతనాన్ని అంగీకరించక తప్పలేదన్నారు.
తెలంగాణ ఉద్యమ సాహిత్యాన్ని వెలువరించటంలో సిద్దిపేట ప్రాంత కవులు, రచయితలు అగ్ర భాగాన నిలిచి ఉద్యమాన్ని ముందుకు నడిపించారన్నారు. ఉద్యమంలో సిద్దిపేట ప్రాంత సాహిత్య కారులు నిర్వహించిన పాత్ర గొప్పదన్నారు. మొత్తం గా తెలంగాణ ప్రాంతంలో రచయితలు, కవులు, గొప్ప సాహిత్య కృషిచేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తంగా తెలంగాణ సాహిత్యాన్ని చరిత్రను, మళ్లీ లిఖించుకోవాల్సిన అవసరం ఉందని సిధారెడ్డి అన్నారు. ఆ బాధ్యతను తెలంగాణ సాహిత్య అకాడమీ తీసుకుంటుందన్నారు. సిద్దిపేట జిల్లా నుండి ఈప్రక్రియ మొదలుపెట్టి 31 జిల్లాల సాహిత్య చరిత్రను సమగ్రంగా లిఖించి వెలులోకి తెస్తామన్నారు. సాహిత్యకారులు తమ జిల్లాల సాహిత్య చరిత్రను లిఖించాలని తెలిపారు.
ఈ సభకు తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు పొన్నాల బాలయ్య అధ్యక్షత వహించగా, సభలో బైతి దుర్గయ్య రచించిన అలుకు మొలకలు పుస్తకాన్ని సిద్దంకి యాదగిరి, పప్పుల రాజిరెడ్డి రచించిన గంగాలం పుస్తకాన్ని చిలుముల శ్రీనివాస్, కథ రచయిత అయోధ్యరెడ్డి రచించిన ఆహారయత్ర కథ సంకలనాన్ని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కవి నకలేశ్వరం శంకరం, ప్రముఖ కవి కందుకూరి శ్రీరాములు రచించిన అలుకు..పిడుచ కవిత సంకలనాన్ని రచయిత శంకరం పరిచయం చేశారు. ఈసభలో తెలంగాణ మీడియ ఆకాడమి సభ్యుడు అంజయ్య, తెరసం గౌరవ అధ్యక్షుడు తోట అశోక్, రంగాచారి, గంబీరావుపేట యాదగిరి, నందిని భగవాన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.