తెలంగాణ

మైనారిటీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి అన్నారు. మైనారిటీ సక్షేమ బడ్జెట్ చర్చలో సభ్యు లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న రాష్ట్రా ల్లో కూడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి రెండు వేల కోట్లు కేటాయించామని అన్నారు. అత్యంత పేదరికంలో మగ్గుతున్న మైనారిటీ వర్గాలను వేగంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా నిధులు ఇస్తున్నట్టు చెప్పారు. పేద ముస్లిం యువతుల వివాహాలకు షాదిముబారక్ క్రింద అందిస్తున్న సహాయాన్ని 75 వేల నుంచి లక్షకు పెంచినట్టు చెప్పారు. ప్రతీ నియోజక వర్గంలో షాదిఖానాలను నిర్మించనున్నట్టు తెలిపారు.