తెలంగాణ

అర్హులైన వారికే రేషన్‌కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/చార్మినార్, మార్చి 22: అర్హులైన వారు ఫుడ్ సేఫ్టీ రేషన్ కార్డులను ఎపుడైనా తీసుకోవచ్చునని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈట ల రాజేందర్ స్పష్టం చేశారు. గురువారం శాసనమండలి సమావేశంలో జరిగిన ప్రశ్నోత్తరాల్లో పలువురు సభ్యులు రేషన్‌కార్డులకు సంబంధించిన అడిగి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ఆహార భద్రత కార్డు సస్పెండ్ చేసింది వాస్తవమేనని, ఈపీఓఎస్ ప్రాజెక్టు పూర్తయినందున మార్చి 1వ తేదీ నుంచి నగరంలో ఈ కొత్త ఆహార భద్రత రేషన్ కార్డుల జారీని తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామాల నుంచి సిటీకి, సిటీ నుంచి గ్రామాలకు వలసలు వెళ్తున్న వారికి కార్డులను గుర్తించేందుకు, నకిలీ కార్డులను గుర్తించి రద్దు చేసేందుకే ఈపీఓఎస్ మిషన్లను అమలు చేసినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ చేపట్టినందున కొత్త కార్డుల జారీలో కొంత జాప్యం జరిగింది వాస్తవమేనని ఆయన వివరించారు.
ఈపీఓఎస్ అనంతరం 20వేల 298 కార్డులను పునరుద్దరించినట్లు తెలిపారు. సభ్యులంతా అవగాహన లోపంతో మాట్లాడరాదని, తమ దృష్టికి ఏమైనా సమస్యలు వస్తే అధికారులతో అడిగి తెల్సుకుని నిబద్దతతో వ్యవహారించాలని సూచించారు. హరీశ్‌రావు మాట్లాడు తూ రాష్ట్రంలో 18.30లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కల్గిన 364 శాస్ర్తియ గోదాములను రూ. 1024.50 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ఇప్పటి వరకు రూ. 818.414కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. ఆధునిక మార్కెట్ గిడ్డంగులు, మూడు అంతస్తుల భవనాలను ఆధునిక సదుపాయాలతో రైతుబజార్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఉత్తమ పోలీస్‌స్టేషన్లకు పురస్కారాలు
పోలీసింగ్‌ను మెరుగుపర్చటం, పోలీసుల సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించేందుకు ఉత్తమ పోలీస్‌స్టేషన్ పురస్కారాలను అందిస్తున్నామని, ఇప్పటికే పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు 2వ ర్యాంకు సాధించటంతో ఈ పురస్కారం దక్కిందని రాష్ట్ర హోం మంత్రి నాయి ని నర్సింహరెడ్డి సభకు వివరించారు. కార్యనిర్వాహక చర్యలు, పీఎస్ వౌలిక సదుపాయా లు, సిబ్బంది అందుబాటు, సిటిజన్ ఫీడ్ బ్యాక్ వంటి ప్రమాణికాలను పరిగణలోకి తీసుకుని ఈ పురస్కారాలను ప్రకటిస్తున్నట్లు తెలిపారు.