తెలంగాణ

వేములవాడ గుడి చెరువుకు గోదావరి నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: వేములవాడ రాజ న్న దేవాలయం వద్ద ఉన్న చెరువుకు గోదావరి నీటిని సరఫరా చేసే విధంగా మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల పథకాన్ని ఖ రారు చేసినట్లు భారీసాగునీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. అసెంబ్లీలో శుక్రవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఎమ్మెల్యే లు చెన్నమనేని రమేశ్, రసమయి బాలకిషన్ అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ దీని వల్ల భక్తులు గోదావరి నీటిలో పుణ్యస్నానాలు ఆచరించవచ్చన్నారు. ఈ స్కీంను రూ.1710 లక్షల నిధులు కేటాయించామన్నారు. 20 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయడానికి పంప్ప్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. 2.50 కి.మీ పొడువు గల అప్రోచ్ చానల్‌ను నిర్మిస్తామన్నారు. గుడి చెరువు వద్ద పంపు హౌస్ నుంచి డెలివరీ సిస్టర్న్ వరకు 3.55 కి.మీ పొడువు గల ప్రెషర్ మెయిన్‌ను నిర్మిస్తామన్నారు. ఇప్పటికే 2 కి.మీ పొడువు అప్రోచ్ చానల్ తవ్వకం పూర్తయిందన్నారున. గుడి చె రువు వద్ద 538 ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తామన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో భూ గర్భ జల మట్టాన్ని మెరుగుపరుస్తామన్నారు. కోయిలసాగర్ ప్రాజెక్టు ఎడమ, కుడికాల్వల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని ఏ వెంకటేశ్వరరెడ్డి అనే ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు బదులుగా మంత్రి బదులిచ్చారు.