తెలంగాణ

ప్రపంచ క్షయ దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: క్షయవ్యాధి నియంత్రణలో భాగంగా తెలంగాణలో ఈ వ్యాధి నివారణకు రివైజ్డ్ నేషనల్ టిబి కంట్రోల్ ప్రోగ్రాంతో కలిసి ప్రణాళికను అమలు చేస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్ అధ్యక్షుడు డాక్టర్ కెహరి ప్రసాద్ చెప్పారు. శుక్రవారం ఇక్కడ వరల్డ్ టిబి డే సందర్భంగా అపోలో హెల్త్ సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టిబిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 391 గుర్తింపు పొందిన మైక్రోస్కోపి కేంద్రాల ద్వారా రోగనిర్ధారణ, చికిత్స సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. రోగి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రోజు విడిచి రోజు మాత్రలు తీకునే భారాన్ని తగ్గించామనన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ తర్వాత షెడ్యూల్ హెచ్ 1 ప్రైవేట్ రంగంలో టిబి నోటిఫికేషన్లను మెరుగుపరిచేందుకు సహాయపడుతుందన్నారు. కేంద్రం ఇటీవల డ్రగ్ రెసిస్టెంట్ టిబినివేగంగా నిర్ధారించేందుకు 15 సిబిఎన్‌ఏఏటి మెషీన్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. 2025 నాటికి టిబిని పూర్తిగా తుడిచిపెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు డాక్టర్ సిహెచ్ సూర్యప్రకాశ్ చెప్పారు. డాక్టర్ సునీత నర్రెడ్డి మాట్లాడుతూ డ్రగ్ రెసిస్టెన్స్ టిబి కారణంగా ప్రపంచానికి ఇప్పుడు టిబి అనేది ఒక ప్రధాన ముప్పుగా పరిణమించిందన్నారు. ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రైవేట్ రం నుండి 1700 కేసులను నివేదించగా, అపోలోనే 700 కేసులను నమోదుచేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రైవేట్ రంగంలో రోగులకు నిబద్ధతతో కూడిన పూర్తి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.