తెలంగాణ

నేరాలు తగ్గించడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడా ది 50 శాతం నేరాలు తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ వికె సింగ్ అన్నారు. జైళ్లశాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సామాజిక బాధ్యతో కూడిన అనే పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఖైదీల్లో మానసిక పరివర్తన, మార్పు తీసుకు వచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లలో ఖైదీలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేరం చేసి జైలుకు వచ్చిన వారికి తగిన రీతిలో కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వారిలో కొందరిలోనైనా మార్పు తీసుకు వస్తే వారు తిరిగి నేరాలు చేయకుండా ఉండే విధం గా తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. శుక్రవారం నాడిక్కడ చంచల్‌గూడలోని జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వికె సింగ్ మాట్లాడుతూ తాము గత కొన్ని సంవత్సరాలుగా చేపట్టిన సంస్కరణల ఫలితంగా బయట నేరాలు తగ్గు ముఖం పట్టాయని అన్నారు. ఈ ఏడాది వంద పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీని ద్వారా 3 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పెట్రోల్ బంకుల్లో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు ఇచ్చి జీవనోపాధి కల్పిస్తామని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో కూడా దశల వారీగా వెయ్యి పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. తమ సొంత రాబడిని పెంచుకుంటూ జైళ్ల తరపున ఎందరికో జీవనోపాధిని కల్పించే దిశగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. దీనిలో భాగంగా 2020 నాటికి రూ.10 వేల కోట్లు స్వతహాగా సమకూర్చుకుంటామని చెప్పారు.

చిత్రం..విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వీకే సింగ్