తెలంగాణ

బంగారు తెలంగాణకు చేరువయ్యాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: శాంతియుత మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిన మహాత్మాగాంధీ మాదిరి కేసీఆర్ సైతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించారని, కేసీఆర్ తెలంగాణ గాంధీ అని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. శుక్రవారం నాడు ఆయన శాసనసభలో వివిధ పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడారు. తెలంగాణ ఆర్కిటెక్ట్ కేసీఆర్ అని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా గొప్పగా నడుస్తోందని, వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి గణనీయమని అన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే గోదావరి నది పూర్తి జలాలలతో కలకలలాడుతుందని చెప్పారు. బంగారు తెలంగాణ చాలా దగ్గర్లో ఉందని, ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో మిషన్ భగీరధ ద్వారా తాగునీటిని అందిస్తున్నారని పేర్కొన్నారు. అంతకుముందు గణేశ్‌గుప్త మాట్లాడుతూ పట్టణాలపై భారం పడకుండా ఉండాలంటే గ్రామాల్లో సౌకర్యాలను పెంచాలని సూచించారు. గ్రామాల్లో వైద్య ఆరోగ్య సౌకర్యాలు, ఉపాధి సౌకర్యాలను కల్పించిన నా డు పట్టణాలపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. నిజామాబాద్‌లో రూ.800 కోట్లతో పనులు జరుగుతున్నాయని, రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పట్టణాల్లో సౌకర్యాలు పె రిగాయని అన్నారు. జాఫర్ హుస్సేన్ మాట్లాడుతూ హై దరాబాద్ నగరాభివృద్ధికి ఇచ్చిన నిధులు ఏ విధంగానూ సరిపోవన్నారు. సరిపడా నిధులు ఇవ్వకుండా అభివృద్ధి సాధించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. వేసవి కాలం లో నాళాలు మరమ్మతులు చేయాలని చెప్పారు. వైద్య ఆరోగ్యం విషయంలోనూ, వివిధ సర్ట్ఫికేట్ల విషయంలోనూ మున్సిపల్ కార్పొరేషన్‌లో సిబ్బంది లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ మిషన్ కాకతీయలో ఏ పనులు జరుగుతున్నాయో, ఎపుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. మిషన్ భగీరథ పనులను కూడా వివరించాలని చెప్పారు. డిస్కామ్‌లలో లోటు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. జలగం వెంకటరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని మిగిలిన మున్సిపాల్టీల్లో సమస్యలు తీవ్రంగానే ఉన్నాయని అన్నారు. చెత్త సేకరణ, చెత్త విభజన, నీటి సరఫరా అంశాలపై దృష్టి పెట్టాలని చెప్పారు.