తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచులకు ఓటు హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచ్‌లకు ఓటు హక్కు కల్పించాలని టీడీపీ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశా రు. అలాగే ఎంపీటీసీ, జడ్‌పీటీసీలకు విధులు, బాధ్యతలు, కార్యాలయాలు అప్పగించాలని సూచించారు. శుక్రవారం నాడు శాసనసభలో వివిధ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. తాత్కాలిక ఉ ద్యోగుల వేతనాలు పెంచాలన్నారు. చాలా గ్రామాల్లో పంచాయతీలకు సొంత భవనాలు లేవని, కొన్ని చోట్ల భవనాలు కుప్పకూలే పరిస్థితి ఉందని చెప్పారు. తాగునీటి సరఫరాలో భాగంగా కొన్ని చోట్ల పైప్‌లైన్‌లు కొత్తగా వేస్తున్నారని, మరికొన్ని చోట్ల పాతవే కొనసాగిస్తున్నార ని ఆరోపించారు. గ్రామాలకు రహదారులు వేయాలన్నారు. సున్నం రాజయ్య మాట్లాడుతూ మున్సిపాల్టీల్లో వౌలిక సదుపాయాలు క ల్పించాలని కోరారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి జరగాలన్నారు. మున్సిపల్, పంచాయతీల కార్మికుల వేతనాలు పెంచాలని చెప్పారు. మన ఊరు- మన ప్రణాళిక పేరుతో గ్రామజ్యోతి ప్రా రంభించారని, వాటి ప్రణాళికలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదన్నా రు. రోడ్లు నిర్మాణం గ్రామాల్లో నత్తనడకన సాగుతోందన్నారు.