తెలంగాణ

అశ్విని అలర్జీ సెంటర్‌లో ఆధునిక వైద్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: లండన్ నుండి వచ్చిన మూడు సంవత్సరాల చిన్నారికి హైదరాబాద్‌లోని అశ్విని అలర్జీ సెంటర్‌లో విజయవంతంగా అలర్జీ పరీక్షలు నిర్వహించారు. చిన్నారి ధృవ్ అనే బాలుడు పుట్టుకతోనే వివిధ రకాలైన అలర్జీలతో సతమతమవుతుండగా, లండన్ వైద్యులు అనేకరకాలైన చికిత్స విధానాలను అవలంబించి చూశారు. ఎన్ని మందులు వాడినా ధృవ్‌కు అలర్జీ తగ్గలేదు. దీంతో బాలుడి తల్లితండ్రులు ఆందోళన చెంది హిమాయత్‌నగర్‌లోని అశ్విని అలర్జీ సెంటర్ వైద్య నిపుణులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్‌ను సంప్రదించారు. పిల్లల్లో ఆయాసం, దగ్గు, తుమ్ములు వంటి నిరంతర ఇబ్బందులకు మూల కారణాలైన హౌస్ డస్ట్ మైట్, పీ నట్స్, మిల్క్ వంటి అలర్జీలకు సంబంధించి ధృవ్‌కు చికిత్స నిర్వహించినట్లు డాక్టర్ నాగేశ్వర్ చెప్పారు. భారతదేశ జనాభాలో సుమారు 30 శాతం మందికి ఆయాసం, దగ్గు, తుమ్ములు, తలనొప్పి, పొట్ట నొప్పి, విరేచనాలు, దురద వంటి తదితర అలర్జీలతో బాధపడుతున్నారని, వీటికి శాస్ర్తియపరమైన, అత్యున్నతమైన వైద్య సేవలు హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చాయన్నారు. 1800-425-0095 జాతీయ టోల్‌ఫ్రీ నంబర్‌ను తెలంగాణ సి.ఎం కె చంద్రశేఖరరావు ఇటీవల ఆవిష్కరించారు. భారత్‌లోనే కాకుండా అమెరికా, మస్కట్, దుబాయ్, సింగపూర్, లండన్, ఇరాక్ వంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు అలర్జీ చికిత్సల కోసం వస్తున్నారని డా. నాగేశ్వర్ తెలిపారు.
రాజీ లేనందునే అపూర్వ ఆదరణ

నాగార్జున సిమెంట్స్ ఎండి కలిదండి రవి

మఠంపల్లి, డిసెంబర్ 22: గడిచిన 32 ఏళ్లలో సిమెంట్ ఉత్పత్తి రంగంలో తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని నాణ్యతలో రాజీలేని కారణంగానే నాగార్జున సిమెంట్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని ఆ సంస్థ ఎండి కలిదండి రవి అన్నారు. మంగళవారం పరిశ్రమ 32వ వార్షికోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా మఠంపల్లిలో జరిగిన పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ పరిశ్రమ మొదట స్థాపించినప్పుడు 200 టన్నుల ఉత్పత్తితో ప్రారంభమై ప్రస్తుతం 4500 టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నామని అన్నారు. 160 మందితో ప్రారంభమై న కార్మికులు ప్రస్తుతం 700 మంది ఉన్నారని, పరోక్షంగా ఉపాధి పొందుతున్నవారు మరొక 1000 మంది ఉంటారని అన్నారు. ఇప్పటివరకు పరిశ్రమ పరిధిలో ఉన్న గిరిజన గ్రామాలలో 40 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని, విద్య, వైద్యరంగాలకు పెద్దపీట వేస్తున్నట్లు ఆయన తెలిపారు. భారతదేశంలోనే మొట్టమొదటి బైసన్ ప్యానల్ ఉత్పత్తి మట్టపల్లి నుండే ప్రారంభమైందని, ప్రారంభం మొదట్లో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ప్రస్తుతం 3వ ప్లాంట్ ఏర్పాటుకు జర్మన కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. సిమెంట్ ఉత్పత్తే కాకుండా కార్మికుల ప్రయోజనాలను కాపాడడంలో సంస్థ ముందుంటుందని, రానున్న రోజులలో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం దివంగత వ్యవస్థాపకులు కలిదండి రామచంద్రరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో సీనియర్ విపి గోపాల్‌రావు, చక్రధర్, డాక్టర్ శ్రీహరి, దస్తగిరిరెడ్డి, అమృతకిరణ్, యూనియన్ నాయకులు శ్రీనివాసాచార్యులు, రాజు పాల్గొన్నారు.