రాష్ట్రీయం

నోరి నరసింహశాస్ర్తీ ట్రస్టు ఆధ్వర్యంలో జూలై 16న గురు పురస్కారాల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: నోరి నరసింహ శాస్ర్తీ ట్రస్టు ఆధ్వర్యంలో జులై 16న గురు పురస్కారాల ప్రదానోత్సవ సభ జరుగుతుందని ట్రస్టు ఉపాధ్యక్షుడు నోరి శివసేనాని ఒక ప్రకటనలో తెలిపారు. చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో నిర్వహించే ఈ ప్రదానోత్సవ సభలో బ్రహ్మశ్రీ ఎంవిఆర్ శర్మకు వేదవ్యాస పురస్కారం, దువ్వూరి సుబ్బలక్ష్మికి జగద్గురు శ్రీ కల్యాణానంద భారతీ మాంతాచార్య పురస్కారం అందజేయబడుతుందని ఆయన వివరించారు. అదేవిధంగా పన్నాల కృష్ణ సుబ్రహ్మణ్యంకు శుశ్రుత వైద్య పురస్కారం, పాలకుర్తి రామమూర్తికి కవిసమ్రాట్ నోరి నరసింహశాస్ర్తీ సాహిత్య పురస్కారం, సుద్దాల సుధాకరతేజకు విశ్వకర్మ పురస్కారం అందజేయబడుతుందని తెలిపారు. మరుమాముల వేంకట రమణ శర్మకు సివై చింతామణి పత్రికారంగ పురస్కారం (జర్నలిజం), నందూరి గోవిందరావుగారికి కళా వేంకట సుబ్బారావు పురస్కారం, శ్రీమతి గీతాగాంధీకి సర్వేపల్లి రాధాకృష్ణన్ పురస్కారం అందజేస్తారని శివసేనాని తెలిపారు. ఈ సందర్భంగా జగద్గురు శ్రీ కల్యాణానంద భారతీ మాంతాచార్య మహాస్వామి రచించిన అక్షర దర్శనమ్ (సంస్కృతం, తెలుగు) కళ్యాణ వ్యాస చంద్రిక, ఓరుగంటి నీలకంఠ శాస్ర్తీ రచించిన అక్షర సమామ్నాయము, శ్రీ కల్యాణ లీలలు, శ్రీ నోరి సుబ్రహ్మణ్యశాస్ర్తీ రచించిన అగ్ని, సూర్య, సోమ కళలు-బీజాక్షరాల రహస్యం, అరుణము-శ్రీ విద్యా రహస్యాలు అనే గ్రంథాలు ఆవిష్కరించబడతాయని శివసేనాని వివరించారు.