తెలంగాణ

నేడు విశ్వనాథశాస్ర్తీ అశీతి మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, ఏప్రిల్ 17: బహుముఖ ప్రజ్ఞాశాలి రొట్టె విశ్వనాథ శాస్ర్తీ అశీతి (80) వర్ష పూర్ణాయుష్షు నిండిన, సహస్ర పూర్ణ చంద్రోదయ దర్శనం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 10 గంటలనుండి విశ్వనాథ శాస్ర్తీ స్వగృహంలో శాస్ర్తీ - అన్నపూర్ణ దంపతులకు శిష్యబృందం ఆధ్వర్యంలో బంధుమిత్రుల సమక్షంలో యాజ్ఞికులు, వేదవిదులు వేదోక్త, సంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు, ఆయుష హోమం, అనంతరం అన్నదానం నిర్వహించనున్నారు. దృశ్యకావ్య పరంపరకు మెరుగులు దిద్ది, సాంప్రదాయ నాటకరంగానికి వెలుగు బాట చూపిన వైతాళికులుగా విశ్వనాథ శాస్ర్తీ ప్రసిద్ధులు. రంగస్థల నటునిగా, ప్రయోక్తగా, దర్శకునిగా, రచయితగా, కవిగా, పౌరాణికునిగా, సాంఘిక సేవా తత్పరునిగా ఆయన పేరు గడించారు. తెలంగాణలో శిష్య పరంపరను కలిగి శ్రీనృసింహ పీఠ నిర్వాహకులైన రొట్టె చంద్రశేఖర్ శాస్ర్తీ, పరమ పావని యమునమ్మలకు తొలి సంతానంగా 1936 మార్చి 17న ధర్మపురిలో జన్మించారు విశ్వనాధుడు. తెలంగాణలో మెట్టమొదటిదై 80 వసంతాలు పూర్తి చేసుకున్న ధర్మపురి లక్ష్మీ నరసింహ నాట్యమండలి వ్యవస్థాపకులలో ఒకరైన తండ్రి నుండి అనువంశిక కళాత్మకతను సంతరించుకుని పధ్నాలుగో ఏటనే రంగస్థలం లోకి అడుగుపెట్టారు.