తెలంగాణ

మేడ్చల్ కలెక్టర్‌కు సర్వే క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డికి మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. మెట్రో రైలుస్టేషన్‌కు అంబేద్కర్ నామకరణ సందర్భంగా వేదికపై మేడ్చల్ కలక్టర్‌ను సర్వే సత్యనారాయణ దూషించడం వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ అంశంపై చర్చించిన ఐఏఎస్ అధికారుల సంఘం, మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అనుచిత ప్రవర్తను తీవ్రంగా ఖండించింది. కలక్టర్‌కు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.