తెలంగాణ

మోదీ పథకాలు చూసి బెంబేలెత్తుతున్న బాబు, కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ పథకాలు చూసి భయం పట్టుకుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు అన్నారు. నర్సింహరావు గురువారం నాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు బండారు దత్తాత్రేయ తదితరులతో కలిసి పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ జస్టిస్ లోయా మృతి కేసులో దాఖలైన పిటీషన్లు సుప్రీంకోర్టు కొట్టివేయడం కాంగ్రెస్ పార్టీకీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెంపపెట్టువంటిదని అన్నారు. జస్టిస్ లోయా మృతి కేసు రాజకీయ కారణాలతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను అప్రతిష్టపాల్చేయడానికి వేసిన కేసులు మాత్రమేనని, ఇప్పటికైనా రాహుల్ గాంధీ అమిత్‌షాకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటని వారు తీవ్రంగా విమర్శించారు. దేశంలో, అనేక రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అసహన రాజకీయాలు చేస్తోందని లక్ష్మణ్ పేర్కొన్నారు. అధికారం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఉండలేదని అన్నారు. దేశ వ్యాప్తంగా నరేంద్రమోదీ, అమిత్‌షాల నాయకత్వంలో బీజేపీ వరుస విజయాలు సాధిస్తోందని, 2014 తర్వాత 16 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని, 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఓడించిందని అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిద్ర పట్టడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కులం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయాలు నడుపుతోందని, మాజీ ప్రధాని ఇందరిగాంధీ మరణానంతరం ఢిల్లీలో సిక్కుల ఊచకోతను, హైదరాబాద్‌లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని గద్దె దించడానికి మతకలహాలు సృష్టించడాన్ని ప్రజలు మరచిపోలేదని లక్ష్మణ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం మహాసభలు కేవలం నరేంద్రమోదీని, బీజేపీని విమర్శించడానికే పరిమితం అయ్యాయని, త్రిపుర ఎన్నికల్లో సీపీఎం ఓటమి తర్వాత వారు ఆ ఓటమిని జీర్ణించుకోలేక బీజేపీని దూషించడం మొదలుపెట్టారని అన్నారు. లౌకిక ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలనే సీపీఎం పిలుపు హాస్యాస్పదని, మతోన్మాద పార్టీలైన మజ్లీస్ , ఐఎంఎల్ పార్టీలతో అంటకాగుతున్న కాంగ్రెస్‌ను సీపీఎం ఎలాంటి లౌకికతత్వాన్ని కోరుకుంటోందని ప్రశ్నించారు. దేశంలో ఎమర్జన్సీ విధించి చీకటి రోజులు తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలను సమర్ధించిన సీపీఎం కమ్యూనిస్టులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని లక్ష్మణ్ విమర్శించారు. సమావేశంలో అధికార ప్రతినిధి ఎన్ వీ సుభాష్, మీడియా కమిటీ కన్వీనర్‌సుధాకర్ శర్మ పాల్గొన్నారు.