తెలంగాణ

‘దోస్త్’ మార్గదర్శకాలు జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో యుజి కోర్సుల్లో చేరేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆన్‌లైన్ కౌనె్సలింగ్ -దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ)కు సమగ్ర మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేశారు. సీట్లు, అడ్మిషన్లు, రిజర్వేషన్లు, అర్హతలు, కమిటీలు గురించి ఈ మార్గదర్శకాల్లో పేర్కొంది. డిగ్రీ సీట్ల భర్తీకి నిర్వహించే దోస్త్ కౌనె్సలింగ్‌ను పర్యవేక్షించేందుకు 9 మందితో కూడిన పీఎంయును ఏర్పాటు చేశారు. అలాగే ఉన్నత విద్యామండలిలో ఒక సమన్వయ కమిటీ, ఉన్నత విద్యాశాఖలో ఒక సమన్వయ కమిటీతో పాటు అన్ని జిల్లాల్లో సమన్వయ కమిటీలు, యూనివర్శిటీల్లో హెల్ప్‌లైన్ కేంద్రాలు పనిచేస్తాయి. కాలేజీల స్థాయిలోనూ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. శనివారం కాలేజీల సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. బి కాం సీట్లలో 60 శాతం కామర్స్‌తో చదివిన వారికి, మిగిలిన 40 శాతం సీట్లు ఇతర విద్యార్థులకు కేటాయిస్తారు. బీఏలో 50 శాతం సీట్లు సోషల్ సైన్స్ నుండి వచ్చిన వారికి, మిగిలిన 50 శాతం ఇతర గ్రూప్‌ల వారికీ కేటాయిస్తారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు డిగ్రీలో నేరుగా సెకండియర్‌లో చేరవచ్చు. ఇంగ్లీషు మీడియంలో ఇతర మీడియం వారు చేరే వీలుంది, కాని ప్రాంతీయ భాషల మాధ్యమంలో చేరాలంటే మాత్రం వారు పదో తరగతి వరకూ ఆయా ప్రాంతీయ భాషల్లో చదువుకుని ఉండాలి. మొత్తం సీట్లలో 85 శాతం స్థానికులకు, మిగిలిన 15 శాతం ఇతరులకు కేటాయిస్తారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీ-ఏకు 7 శాతం, బీసీ-బీకి 10 శాతం, సీ గ్రూప్‌నకు 1 శాతం, డీ గ్రూప్‌నకు 7 , ఇ గ్రూప్‌నకు 4 శాతం సీట్లు కేటాయిస్తారు. మెరిట్‌లో సీట్లు పొందిన రిజర్వుడ్ అభ్యర్ధులను ఆయా రిజర్వుడ్ గ్రూప్‌లలో పరిశీలించడం జరగదు. వారి సీట్లను మెరిట్ అభ్యర్థులుగానే పరిగణిస్తారు. ఎస్సీలో సీట్లు మిగిలితే ఎస్టీలకు, ఎస్టీల్లో సీట్లు మిగిలితే ఎస్సీలతో భర్తీ చేస్తారు. ఒక వేళ సీట్లు మిగిలితే వాటిని జనరల్ పూల్‌లో భర్తీ చేస్తారు. ఇక బీసీల్లో సీట్లు మిగిలితే ఏ గ్రూప్ నుండి బీకి అక్కడి నుండి ఇ వరకూ పరిశీలిస్తారు. ఇంకా సీట్లు మిగిలితే వాటిని జనరల్ పూల్‌కు బదలాయిస్తారు. ఎన్‌సీసీకి 1, స్పోర్ట్సుకు అర శాతం, స్కౌట్స్‌కు 1, కేప్ కోటా 2, విహెచ్ -1, హెచ్ హెచ్-1, ఓహెచ్-1 శాతం చొప్పున రిజర్వు చేశారు. మహిళలకు మాత్రం 33.3 శాతం సీట్లు రిజర్వు చేశారు. ఏదైనా కాలేజీలో గత మూడేళ్లుగా 25 శాతం కంటే తక్కువ సీట్లు భర్తీ అయిన పక్షంలో అక్కడ అలాట్ చేసిన అభ్యర్థులను వేరే కాలేజీకి బదలాయిస్తారు.