తెలంగాణ

ఆర్టీసీ హాస్పిటల్‌లో కార్మికులకు మెరుగైన వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: టీఎస్ ఆర్టీసీ హాస్పిటల్‌లో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆ సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. సంస్థలో పని చేసే కార్మికులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంస్థ మనుగడ బాగుంటుందని చెప్పారు. శుక్రవారం ఆయన తార్నాకలో ఉన్న ఆర్టీసీ హాస్పిటల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి సిబ్బందిని, వైద్య సేవలు అందుకుంటున్న కార్మికులు, ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమ కోసం చిత్తశుద్ధితో పని చేస్తోందని అన్నారు. టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల సంక్షేమం కోసం, వైద్య సేవలను మెరుగుపరచడం కోసం అనేక చర్యలు తీసుకుంటోందని చైర్మన్ ఈ సందర్భంగా చెప్పారు. రోగులు రోగ నిర్ధారణ విషయంలో గానీ, మందులను తీసుకోవడంలో గానీ ఎక్కువ సమయం నిలబడి, వేచి ఉండే పరిస్థితి రావద్దని అన్నారు. ఇందుకు అనుగుణంగా అదనపు మందుల పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ఆన్‌లైన్ ప్రోసెస్ విధానాన్ని సరళతరం చేయాలని ఐటీ విభాగం సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సీనియర్ పీఆర్‌ఓ కిరణ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, ఆసుపత్రి సీఎంఓ మమత నారియన్, డాక్టర్లు పాల్గొన్నారు.

చిత్రం..తార్నాకలో ఉన్న ఆర్టీసీ హాస్పిటల్‌ను సందర్శించిన టీఎస్ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ