తెలంగాణ

రాజీనామా ఉపసంహరించుకున్న సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని తన పదవికి చేసిన రాజీనామాపై పునరాలోచన చేసి వ్యూహాత్మకంగా ఉపసంహరించుకున్నారు. దీనితో తన మున్సిపల్‌చైర్‌పర్సన్ పీఠాన్ని తిరిగి అధిష్టించారు. ఈమేరకు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కేవీ.రమణాచారికి తన రాజీనామా ఉపసంహరణ పత్రాన్ని మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి సమర్పించారు. ఈ సందర్భంగా తన చాంబర్‌లోని సీటుపై పావని ఆసీనులు కావడంతో మున్సిపల్ కౌన్సిలర్లు, తెరాస నాయకులు అభినందనలు తెలిపారు. కాగా మార్చి 17న మున్సిపల్ కాంట్రాక్టు పనుల కమీషన్ల పర్వంపై వ్యాఖ్యలను అనుకోని విధంగా నోటి నుండి స్లిప్ కావడంతో దీనిపై రాజకీయ దుమారం లేవడం, అదే రోజు రాత్రి పొద్దు పోయాక వ్యక్తిగత కారణాలతో తన పదవికి పావని రాజీనామా చేశారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం సృష్టించడం, బలహీన వర్గాలకు చెందిన పావనిని బలి చేశారని, దీనికి మంత్రి కేటీఆర్ బాధ్యత వహంచాలంటూ విపక్ష పార్టీలు విమర్శల పర్వం కొనసాగించారు. అయితే పార్టీకి, మంత్రి మెడకు ఈ ఉదంతం చుట్టుకోకుండా వ్యూహాత్మకంగా పావనిచే రాజీనామా చేయించడంతో విపక్షాలు పావనికి మద్దతు తెలిపాయి. దీంతో ఆమెకు సానుభూతి పెరిగింది. అయితే రాజీనామా పర్వంపై విమర్శలు కొనసాగుతున్న సమయంలోనే పావని తండ్రి ఒగ్గు నాగభూషణం కన్నుమూయడంతో రాజకీయ విమర్శలు ఆగిపోయాయి. మరో వైపు ఈ పదవిపై కొందరు అధికార పార్టీ కౌన్సిలర్లు ఆశలు పెట్టుకుని ఆ దిశగా ప్రయత్నాలు సాగించడంతో మంత్రి వారి చర్యలను మానుకోవాలని హెచ్చరించిన వైనం కూడా ప్రచారంలోకి వచ్చింది. మున్సిపల్ పాలనకు అంతరాయం ఏర్పడడంతో మంత్రి కేటీఆర్ ఈనెల 6న సిరిసిల్లలో కొన్ని ప్రైవేటు కార్యక్రమాలలో పాల్గొని, పావని ఇంటికి వెళ్ళి పరామర్శించారు. అదే రోజు రాత్రి స్థానిక పద్మనాయక ఏసీ ఫంక్షన్ హాలులో మున్సిపల్ కౌన్సిలర్లతో అంతర్గత సమావేశం నిర్వహించి, చైర్‌పర్సన్ రాజీనామా వ్యవహారంపై అభిప్రాయాలు తీసుకున్నారు. ఇంటా, బయటా పావనికే సంఘీభావం పెరగడం, ఏడాది కోసం మళ్ళీ కొత్త వారిని పెడితే కొత్త సమస్యలు తెరపైకి రావడంతో పాటు విపక్ష పార్టీల నుండి కూడా రాజకీయ దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందన్న కారణంతో మంత్రి తిరిగి పావనికే అవకాశం ఇవ్వడానికి మొగ్గు చూపారు. దీనితో మంత్రి నిర్ణయం మేరకు, మున్సిపల్ చట్టంలోని 55 సెక్షన్ ప్రకారం ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని రాజీనామాను ఉపసంహరించుకున్నారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ చాంబర్‌లో తన సీటుపై ఆసీనులైన పావనిని కౌన్సిలర్ల అభినందించి, స్వీట్లను పంపిణీ చేసుకున్నారు. ఎట్టకేలకు 34 రోజుల పాటు మున్సిపల్ పాలనకు అంతరాయం కలుగగా, ఎట్టకేలకు అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరు నేపథ్యంలో రాజీనామా ఉపసంహరించుకోవడంతో హైడ్రామాకు తెరపడింది.

చిత్రం..రాజీనామా ఉపసంహరణ పత్రం సమర్పిస్తున్న పావని