తెలంగాణ

మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఏప్రిల్ 20: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచి మే 5వ తేదీలోగా ట్రయల్న్‌న్రు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్టవ్రిద్యుత్, ఎస్సీ కులాల అభివృది శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లాలో ని ల ఇమాంపేట వద్ద నిర్మిస్తున్న మిషన్ భగీరథ నీటిశుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపడుచుల తాగునీటి కష్టాలు తీర్చే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఇంటికి శుద్ధజలాలు అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. వేసవిలో తాగునీటి సమ స్య తలెత్తకుండా పనులను త్వరతగతిన పూర్తిచేస్తున్నామన్నారు. 2018 చివరినాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించే లక్ష్యం లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మే 5వతేదీ నాటికి నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ నుండి సూర్యాపేటకు నీటిని అందించేలా కృషిచేస్తున్నామన్నారు. ఈనెల 30వ తేదీలోగా పైప్‌లైన్ పనులు పూర్తిచేసేలా పనిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఉండ్రుగొండ గుట్టపై నిర్మిస్తున్న వాటర్ డిస్ట్రిబ్యూటర్ పనులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్, మిషన్ భగీరథ సూపరింటెండెంట్ ఇంజనీర్ మధుబాబు, ఈఈలు వెంకటేశ్వర్లు, మోహన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, డీఈ నరేష్ ఉన్నారు.