తెలంగాణ

చంద్రబాబుది అధర్మ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: ఏపీలో చంద్రబాబునాయుడు చేసిన దీక్ష ధర్మదీక్ష కాదని, అది అధర్మదీక్ష మాత్రమేనని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి శ్రీ్ధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబునాయుడు దీక్ష కేవలం ప్రధాని నరేంద్రమోదీని తిట్టేందుకే పెట్టారా అని ప్రశ్నించారు. ప్రజలు చూస్తుంటే, ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రధానిని విమర్శించే ముందు వళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని అన్నారు. ఎంఎల్‌ఏ బాలకృష్ణను చూసి ప్రధాని పద్ధతులు నేర్చుకోవాలా అని ప్రశ్నించారు.
ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ హైదరాబాద్‌లో ఎలా పర్యటిస్తారో చూస్తామని అన్నారు. వెంటనే బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ఎక్కడికక్కడ బీజేవైఎం ప్రతినిధులు అడ్డుకుంటారని అన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ తమకు పద్ధతులు నేర్పుతారా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఉన్న సభలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, ఎన్టీఆర్ కడుపున పుట్టిన బాలకృష్ణ ఇలా మాట్లాడటం ఆయన తండ్రి ఆత్మను క్షోభింపచేయడమేనని అన్నారు. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణను తెలుగు ప్రజలు అవమానంగా భావిస్తున్నారని, టీడీపీ అధికారం అనుభవించడం నరేంద్రమోదీ భిక్ష మాత్రమేనని మరువరాదని అన్నారు.