తెలంగాణ

గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు వైద్యులు ముందుకు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/కేపీహెచ్‌బీకాలనీ, ఏప్రిల్ 21 : దేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు ముందుకు రావాలని భారత ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం కూకట్‌పల్లి జే ఎన్‌టీయూహెచ్‌లో మల్లారెడ్డి ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గతంలో దేశంలో 27 శాతం అభివృద్ధి రేటు ఉండేదని, ప్రస్తుతం 10 శాతం రావడం లేదన్నారు. వైద్యులు ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యవంతమైన దేశంగా మార్చాలని సూచించారు. దేశంలో బాలికలపై, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిని ప్రజలే బహిష్కరించాలన్నారు. అనంతరం మెడికల్ విభాగంలో ఉతీర్ణత సాధించిన విద్యార్థులకు పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, మహేందర్ రెడ్డి, వైద్యులు భద్రారెడ్డి, ప్రీతిరెడ్డి, మహేందర్‌రెడ్డి, భాస్కర్ రావు, శాస్ర్తి, చిత్తరంజన్ దాస్, సిద్దప్ప, చంద్రకాంత్ శిరోలేతో పాటు ఉపాధ్యాయులు , విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

చిత్రం..కార్యక్రమంలో పాల్గొన్న భారత ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు