తెలంగాణ

తెలంగాణకు ఎయిమ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, ఏప్రిల్ 21: మూడున్నర సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ పోరాటానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్‌ను తెలంగాణాలో ఏర్పాటుచేసేందుకు పరిపాలనామోదం తెలిపిందని భువనగిరి పార్లమెంట్ సభ్యుఆ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. స్థానిక రహదారి బంగ్లాలో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎంపి బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ తెలంగాణకు ఎయిమ్స్ రావడం రాష్ట్ర ప్రభుత్వ విజయమన్నారు. తెలుగురాష్ట్రాల విభజనలో బాగంగా శ్రీక్రిష్ణకమిటీ నివేదిక మేరకు తెలంగాణాలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా వౌఖికంగా ఆమోదం తెలిపినప్పటికీ నేడు లిఖితపూర్వకంగా ఆమోదిస్తూ ప్రభుత్వానికి లేఖపంపిందన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మెరకు ఎయిమ్స్‌ను బీబీనగర్‌లోనే ఏర్పాటు చేసేందుకు అవకాశాలున్నాయని ఎంపీ బూర ఆశాభావం వ్యక్తంచేశారు. కేంద్రప్రభుత్వ నిబంధనల మేరకు రాష్టంలో మూడు చోట్లను ఎంపికచేసి వివరాలతోకూడిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపుతామన్నారు. రైలు, రోడ్డు, వాయి రవాణా సౌకర్యాలు మెండుగా ఉన్న బీబీనగర్‌లోనే ఎయిమ్స్ ఏర్పాటుచేసేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఎయిమ్స్ ఏర్పాటు చేసేందుకు కావాల్సిన 220ఎకరాలలో భాగంగా 160ఎకరాలను ఇప్పటికే సేకరించారని మరో 60ఎకరాలను త్వరలోనే గుర్తించి డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కేంద్రానికి పంపుతామని బూర తెలిపారు. నిమ్స్ ఏర్పాటుకు సహకరించిన కేంద్రమంత్రి జగత్‌ప్రకాష్‌నడ్డా, హర్షవర్ధన్‌లకు ఎంపీ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమమంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్లశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి క్రిష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ డాక్టర్ జడల అమరేందర్, సింగిల్ విండొ చైర్మెన్ ఎ.సత్తిరెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

చిత్రం..భువనగిరిలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ బూర నర్సయ్యగౌడ్